భారతీయ వ్యోమగామి ( Indian astronaut ) గా కల్పనా చావ్లా ( Kalpana chawla ) పేరు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేదే. అంతరిక్షంలో ప్రవేశించడం...తిరుగు ప్రయాణంలో ప్రాణాలు కోల్పోవడం ఎవ్వరూ మర్చిపోలేని విషయం. అందుకే నాసా ( NASA ) తన స్పేస్ క్రాఫ్ట్ కు ఆమె పేరు పెడుతోంది.
కల్పనా చావ్లా. అంతరిక్షయాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో కూలిపోయిన నాసా వ్యోమనౌక కొలంబస్ ( Columbus ) లో ప్రయాణించిన భారతీయ మహిళ. ఈ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. భారతదేశం నుంచి అంతరిక్షంలో ప్రవేశించిన తొలి మహిళగా కల్పనా చావ్లా ప్రసిద్ధకెక్కారు. దివంగత కల్పనా చావ్లాకు నివాళి అర్పించేందుకు నాసా తన వాణిజ్య కార్గో అంతరిక్ష నౌకకు ఆమె పేరు పెట్టింది. మానవ సహిత అంతరిక్ష ప్రయాణానికి ఆమె చేసిన కృషి, త్యాగానికి ఈ విధంగా నాసా నివాళులర్పించింది. అమెరికన్ గ్లోబల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ నార్త్రోప్ గ్రుమ్మన్ తమ తదుపరి సిగ్నస్ క్యాప్సూల్‌కు ‘ఎస్‌ఎస్ కల్పనా చావ్లా’ అని పేరు పెడతున్నట్టు ప్రకటించింది.
2003లో ఆరుగురు సభ్యులతో ప్రయాణిస్తున్న కొలంబియా నౌక కుప్పకూలిన ఘటనలో కల్పనా చావ్లా మరణించిన విషయం తెలిసిందే. "నాసా ( NASA ) లో పనిచేస్తూ భారత సంతతికి చెందిన మొదటి మహిళా వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన కల్పనా చావ్లాను ఈ రోజు తాము గౌరవిస్తున్నామని.. మానవ సహిత అంతరిక్ష ప్రయాణానికి ఆమె చేసిన కృషి శాశ్వత ప్రభావాన్ని చూపిందని కంపెనీ ట్వీట్ చేసింది. అంతేకాకుండా కొలంబియాలో ఆన్‌బోర్డ్‌లో ఆమె చేసిన చివరి పరిశోధన అంతరిక్ష ప్రయాణ సమయంలో వ్యోమగామి ఆరోగ్యం, భద్రతను అర్థం చేసుకోవడానికి సహాయపడిందని కంపెనీ స్పష్టం చేసింది. Also read: California: ఆగని మంటలు..వేలాది గృహాలు దగ్దం, ముగ్గురి మృతి