India-China Talks: ఇండో చైనా13వ కార్ప్స్ కమాండర్ స్థాయి సైనిక చర్చలు ముగిశాయి. రెండు దేశాల మధ్య దాదాపు 8న్నర గంటలు సుదీర్ఘంగా సమావేశం జరిగింది. కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తూర్పు లడాఖ్‌లోని(East Ladakh) వివాదాస్పద ప్రాంతాల్నించి చైనా బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని ఇండియా మరోసారి తేల్చి చెప్పింది. ఇండియా చైనా మద్య 13వ దశ కార్ప్స్ కమాండర్ స్థాయి సైనిక చర్చల్లో ఇండియా స్పష్టం చేసింది.ఇరుదేశాల మధ్య దాదాపు 8న్న గంటల సేపు చుషుల్ మోల్డో బోర్డర్ పాయింట్ వద్ద ఈ చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో కీలకమైన అంశాలు ప్రస్తావనకొచ్చాయి. ప్రధానంగా తూర్పు లడాఖ్‌లోని పెట్రోలింగ్ పాయింట్ నెంబర్ 15 (Petrol Point 15)నుంచి బలగాల ఉపసంహరణపై ప్రధానంగా చర్చ సాగింది. 


2020 మే నెలలో జరిగిన ఘర్షణ పునరావృతం కాకుండా సరిహద్దుల్లో పెట్రోలింగ్ చేపట్టాలని, కొత్త ప్రోటోకాల్స్ రూపొందించాలని ఇరు దేశాలు ఓ అంగీకారానికి వచ్చాయి. 2020 మే 5వ తేదీన తూర్పు లడాఖ్‌లో భారత చైనా సైనికుల(Indo China Dispute)మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఇరువైపులా పదుల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్ని చల్లాచ్చేందుకు వివిధ స్థాయిల్లో సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. రాజకీయ, దౌత్య, సైనికపరమైన చర్చలు కొనసాగుతున్నాయి. జూలై 31వ తేదీన 12 దశ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో కుదిరిన ఒప్పందం ప్రకారం గోగ్రా నుంచి బలగాల ఉపసంహరణ ప్రక్రియను ఇండియా, చైనాలు పూర్తి చేశాయి. రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడాలంటే డెస్పాంగ్‌తో సహా అన్ని వివాదాస్పద ప్రాంతాలపై ఓ ఒప్పందానికి రావల్సిన అవసరముందనేది భారత్ వాదన. ఎందుకంటే ఇటీవల చైనా సైన్యం వాస్తవాధీన రేఖను అతిక్రమించి ఉత్తరాఖండ్‌లోని బారాహోతి సెక్టార్, అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నించింది.


Also read: Tamilnadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు, మళ్లీ వస్తోన్న చిన్నమ్మ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook