Oxygen to India: కరోనా మహమ్మారి దేశంలో తీవ్రంగా విజృంభిస్తోంది. వరుసగా మూడవ రోజు దేశంలో 3.5 లక్షల కేసులు నమోదయ్యాయి. దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రం కావడంతో సింగపూర్, సౌదీ అరేబియా దేశాల్ని భారీగా సహాయం అందుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్ (Corona Seond Wave) ధాటికి ఇండియా విలవిలలాడిపోతోంది. దేశంలో వరుసగా మూడవ రోజు 3.5 లక్షల కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. భారీగా కేసులు పెరుగుతుండటంతో ఆక్సిజన్, మెడికల్ పరికరాలు, బెడ్స్, మందుల కొరత తీవ్రమైంది. మరీ ముఖ్యంగా ఆక్సిజన్ లభించక( Oxygen Shortage)చాలా ఆసుపత్రులు చేతులెత్తేస్తున్నాయి. కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. గత 24 గంటల్లో దేశంలో కరోనా కారణంగా 2 వేల 812 మంది మరణించారు. ప్రతిరోజూ ఇదే సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సంక్షోభ సమయంలో భారత్‌కు అండగా నిలిచేందుకు సింగపూర్(Singapore), సౌదీ అరేబియా, బ్రిటన్, అమెరికా దేశాలు ముందుకొచ్చాయి. ముఖ్యంగా ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు సింగపూర్, సౌదీ అరేబియా నుంచి భారీగా సహాయం అందుతోంది.


సింగపూర్ నుంచి 5 వందల బైపాప్ (Bipap)పరికరాలు, 250 ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లు (Oxygen Concentrators) ఇతర వైద్య సామగ్రితో నిండిన ఎయిర్ ఇండియా విమానం ముంబైకు చేరుకుంది. అటు అమెరికా నుంచి 318 ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లతో కూడిన మరో విమానం ఢిల్లీకు చేరుకుంది. ఇక సౌదీ అరేబియా (Saudi Arabia)నుంచి  80 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ( 80 Tons of liquid oxygen) ఇండియాకు వస్తోంది. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. 80 టన్నుల  లిక్విడ్ ఆక్సిజన్‌తో 4 క్రయోజనిక్ ట్యాంకులు షిప్ ద్వారా ముంద్రా పోర్టుకు చేరుకోనున్నాయి.


Also read: India Covid-19 Cases: కరోనా ఎఫెక్ట్, భారత్‌ నుంచి విమానాలపై మరో దేశం నిషేధం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook