India hands over PLA soldier: న్యూఢిల్లీ‌: భారత భూభాగంలోకి ప్రవేశించిన చైనా ( China ) పీపుల్స్ లిబరేటెడ్ ఆర్మీ సైనికుడిని తూర్పు లడఖ్‌లోని డెమ్‌చోక్ సెక్టార్‌లో ఇండియన్ ఆర్మీ (india) ఇటీవల అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ సైనికుడిని మంగళవారం రాత్రి ఇండియన్ ఆర్మీ అధికారులు చైనా అధికారులకు అప్పగించారు. రెండురోజుల క్రితం కార్పోర‌ల్ వాంగ్ యా లాండ్ అనే పీఎల్ఏ సైనికుడు అనుకోకుండా వాస్త‌వాధీన రేఖ (LAC) దాటి వ‌చ్చాడు. ఆ సైనికుడిని తూర్పు లడఖ్‌లోని డెమ్‌చోక్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్న‌ట్లు ఆర్మీ సోమవారం ప్రకటించింది. అతనికి ఆహారం, దుస్తులు అందించి సౌకర్యాలను సైతం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో చైనా సైనికుడిని భారత అధికారులు పలు కోణాల్లో ప్రశ్నించారు. Also read: Chinese Soldier Captured: ఇండియన్ ఆర్మీ చేతికి చిక్కిన చైనా సైనికుడు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే తమ సైనికుడు తప్పిపోయిన వెంటనే చైనా కూడా అక్టోబరు 18న ఓ ప్రకటనను సైతం విడుదల చేసింది. స్థానిక జంతు కాప‌రికి స‌హాయం చేస్తూ అక్టోబ‌ర్ 18వ తేదీ సాయంత్రం త‌మ సైనికుడొక‌రు అదృశ్య‌మైనట్లు తెలిపింది. ఈ మేరకు సైనికుడిని అప్పగించాలని చైనా భారత ఆర్మీకి సైతం అభ్యర్థనను పంపింది. ఈ క్రమంలో భారత్ స్పందించి దొరికిన సైనికుడిని చుషుల్-మోల్డో సమావేశ స్థలంలో చైనా అధికారులకు అప్పగించింది. Also read: Navratri Day 5: సరస్వతీ నమోస్తుతే.. చదువుల తల్లి అలంకరణలో అమ్మవారు


జూన్ 15వ తేదీన గాల్వ‌న్ లోయ‌లో జరిగిన హింసాత్మక ఘ‌ర్ష‌ణ జ‌రిగిన త‌ర్వాత భారత్, చైనా (India-China) మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటినుంచి రెండు దేశాల సైనిక అధికారుల మధ్య ప‌లు ద‌శ‌ల్లో దౌత్య చ‌ర్చ‌లు సైతం జ‌రిగాయి. అక్టోబర్ 12న ఇరు సైనిక అధికారుల మధ్య ఏడవ సారి చర్చలు జరిగాయి. తాజాగా ఎనిమిదో సారి కార్ప్స్ క‌మాండ‌ర్ స్థాయి చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. అయితే ఇరు దేశాల మధ్య చర్చలపై ఇంకా స్పష్టమైన తేదీ ఖరారు కాలేదు. Also read: Hyderabad Rains: బ్రహ్మాజీకి నెటిజన్ల షాక్.. ట్విట్టర్ నుంచి తప్పుకున్న నటుడు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe