న్యూఢిల్లీ: అమెరికాలో కరోనా వైరస్‌తో భారత సంతతికి చెందిన మీడియా ప్రతినిధి బ్రహ్మ కంచిబొట్ల (66) మరణించారని, కరోనాతో బ్రహ్మ ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. న్యూయార్క్ యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా అనే మీడియా సంస్థలో కరెస్పాండెంట్‌గా పని చేస్తున్న బ్రహ్మ మృతిపట్ల అమెరికా మీడియా వర్గాలు సంతాపం తెలిపాయి.


బ్రహ్మకు కరోనా సోకిందని తెలియగానే తన నివాసంలో హోంక్యారంటైన్‌లో ఉంటున్నాడు. అతడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో స్థానిక ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అప్పటికే అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటలెటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స చేసినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రహ్మ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. అంత్యక్రియల కోసం తన తండ్రి మృతదేహాన్ని ఇస్తారో లేదోనని ఆయన తనయుడు సుడామా కంచిబోట్ల తెలిపారు. బ్రహ్మకు భార్య అంజన, కూతురు సుజన, కుమారుడు సుడామా ఉన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..