పాక్ లో భారత హైకమిషన్ సిబ్బందిపై దాడి దురదృష్టకరం.. భారత్
పాకిస్తాన్ కు చెందిన ఇద్దరు హైకమిషన్ సిబ్బందిని భారత్ బహిష్కరించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఇస్లామాబాద్ లోని భారతీయ సిబ్బందిని వేధించడం, వారి విధులకు ఆటంకం కల్గించడం వంటి సంఘటన చేసుకోవడం భారత్ గుర్రుగా ఉంది.
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కు చెందిన ఇద్దరు (Pakistan High Commission) హైకమిషన్ సిబ్బందిని భారత్ (India Expelled) బహిష్కరించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో (Islamabad) ఇస్లామాబాద్ లోని భారతీయ సిబ్బందిని వేధించడం, వారి విధులకు ఆటంకం కల్గించడం వంటి సంఘటన చేసుకోవడం భారత్ గుర్రుగా ఉంది. పాకిస్తాన్ రక్షణ వ్యవస్థకు చెందిన ఇంటెలిజెన్స్ సిబ్బంది గౌరవ్ అహ్లువాలియాతో సహా భారత (Indian Diplomats) దౌత్యవేత్తల వాహనాలపై దాడి, ఇస్లామాబాద్ లోని వారి నివాసాల వద్ద భయపెట్టే రీతిలో ప్రవర్తించడం సరికాదన్నారు. భారత ఉన్నతాధికారులను వేధించడం, సిబ్బందిని భయబ్రాంతులకు గురిచేయడమనే సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానిక వ్యక్తుల ద్వారా వెల్లడైందన్నారు.
Also Read: Russia: రష్యాను పీల్చేస్తున్న పినుజులు.. మరో ముప్పు పొంచి ఉందన్న శాస్త్రవేత్తలు...
గూఢచర్యం చేశారనే ఆరోపణలపై పాకిస్తాన్ కు చెందిన ఇద్దరు హైకమిషన్ అధికారులను మే 31 న భారత్ వారిని బహిష్కరించింది. భారత భద్రతా వ్యవస్థాపనలపై సమాచారాన్ని పొందటానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ హై కమిషన్ సిబ్బందిని కరోల్ బాగ్ లోని బికనేర్వాలా చౌక్ వద్ద అదుపులోకి తీసుకున్నారని, వారిపై అధికారిక రహస్యాలు చట్టం కింద కేసు నమోదైందని ఢిల్లీ పోలీసు అధికారులు వెల్లడించారు. ( వాడివేడిగా కృష్ణా రివర్ బోర్డు సమావేశం.. తెలుగు రాష్ట్రాల మధ్య తేలిన లెక్కలు )
Also Read: Telangana: ఒక్క రోజే 127 కరోనా కేసులు.. ఆరుగురు మృతి
కాగా వీరి బహిష్కరణ నిర్ణయాన్ని పాకిస్తాన్ ఖండించింది. తప్పుడు ఆధారాలు, ఆరోపణలపై అదుపులోకి తీసుకోవడం సరికాదన్నారు. పాకిస్తాన్ (Pakistan Exetrnal Affairs) విదేశాంగ కార్యాలయం నుండి వచ్చిన ఒక ప్రకటన ప్రకారం ఇద్దరు వ్యక్తులు తమను దౌత్య సిబ్బందిగా గుర్తించినప్పటికీ హింసించబడ్డారని పాక్ ఆరోపిస్తోంది. కాగా ఈ ఆరోపణలను భారత్ తిరస్కరించడంతో పాటు గూఢచర్యం చేస్తున్నప్పుడు పాకిస్తాన్ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని పేర్కొంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..