Indians In Ukraine : ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులకు మరో హెచ్చరిక
Advisory to Indians In Ukraine : ఉక్రెయిన్‌లో రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం నెలకొన్న నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులు దేశాన్ని విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలి పోవాల్సిందిగా ఉక్రెయిన్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం మరోసారి హెచ్చరికలు జారీచేసింది.
Advisory to Indians In Ukraine : ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం చివరిసారిగా అక్టోబర్ 19నే ఒకసారి ఇదే తరహాలో ఉక్రెయిన్‌లో భారతీయులను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీచేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి సైతం అదే సూచనలను గుర్తుచేస్తూ భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉన్న ఫళంగా దేశం విడిచిపెట్టి పోవాల్సిందిగా సూచించిన భారత రాయబార కార్యాలయం.. అందుకోసం ఎవరికి వారు అందుబాటులో ఉన్న మార్గాన్ని చూసుకోవాల్సిందిగా సూచించింది.
అక్టోబర్ 19 జారీ చేసిన సూచనల మేరకు ఇప్పటికే చాలా మంది భారతీయులు దేశం విడిచిపెట్టి వెళ్లినట్టు గుర్తుచేసిన అధికారులు.. కొత్తగా దేశం విడిచివెళ్లే వారికి ఉక్రెయిన్ బార్డర్ దాటేందుకు వీలుగా దేశ సరిహద్దుల వరకు వెళ్లేందుకు అవసరమైన సహాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. ఎవరికైనా, ఎలాంటి సహాయం అవసరమైతే +380933559958, +380635917881, 380678745945 నెంబర్లలో సంప్రదించవచ్చని సూచించింది. ఈ మేరకు ఉక్రెయిన్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
[[{"fid":"249925","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"indian-embassy-in-ukraine-issued-advisory-warning-to-indians-in-ukraine.jpg","field_file_image_title_text[und][0][value]":"Indians In Ukraine : ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులకు మరో హెచ్చరిక "},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"indian-embassy-in-ukraine-issued-advisory-warning-to-indians-in-ukraine.jpg","field_file_image_title_text[und][0][value]":"Indians In Ukraine : ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులకు మరో హెచ్చరిక "}},"link_text":false,"attributes":{"alt":"indian-embassy-in-ukraine-issued-advisory-warning-to-indians-in-ukraine.jpg","title":"Indians In Ukraine : ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులకు మరో హెచ్చరిక ","class":"media-element file-default","data-delta":"1"}}]]
ఉక్రెయిన్ విడిచిపెట్టి వెళ్లే వాళ్లు బార్డర్ క్రాసింగ్ కోసం భారత రాయబార కార్యాలయం అధికారిక వెబ్ సైట్ లోనూ సహాయం కోసం సంప్రదించవచ్చని భారత రాయబార కార్యాలయం తేల్చిచెప్పింది. అంతేకాకుండా ఇంకా అవసరమైతే ఉక్రెయిన్ బార్డర్ క్రాసింగ్ కోసం సరిహద్దు దేశాలైన రొమేనియాలో ఉన్న తమ రాయబార కార్యాలయం ఫోన్ నెంబర్ +40372147432, 40731347727, పోలాండ్ లో భారత రాయబార కార్యాలయాన్ని +48225400000 , +48606700105 నెంబర్లపై సంప్రదించవచ్చని ఉక్రెయిన్ లో ఉన్న రాయబార్య కార్యాలయం తమ ప్రకటనలో పేర్కొంది. అలాగే హంగెరీ, స్లోవేకియా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలను సైతం సహాయం కోసం సంప్రదించవచ్చని స్పష్టంచేసింది.
Also Read : Rishi Sunak to Kamala Harris: రిషి సునక్ ఒక్కడే కాదు.. విదేశాలను ఏలిన భారతీయుల జాబితా
Also Read : Rishi Sunak Interesting Facts: రిషి సునక్ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు
Also Read : Rishi Sunak: బుద్ది పోనిచ్చుకోని భారతీయులు... గూగుల్ ట్రెండింగ్ లో రిషి సునక్ క్యాస్ట్ సెర్చింగ్
Also Read : Russia vs Ukraine War: రష్యా vs ఉక్రెయిన్ వార్.. భారతీయులకు హెచ్చరికలు