Rishi Sunak to Kamala Harris: రిషి సునక్ ఒక్కడే కాదు.. విదేశాలను ఏలిన భారతీయుల జాబితా

Indian Origin Leaders Like Rishi Sunak: రిషి సునక్ నుండి కమలా హ్యారీస్ వరకు.. ప్రపంచం చూసిన పలు దేశాధి నేతలు భారతీయ సంతతికి చెందినవారే కావడం విశేషం. విదేశాల నుంచి వలస వచ్చిన బ్రిటిషర్స్ మన దేశాన్ని ఏలడం గత చరిత్ర అయితే.. మన భారతీయులు విదేశాలకు వలస వెళ్లి అక్కడ తిరుగులేని శక్తిగా ఎదిగి ఆ దేశాలనే ఏలే స్థాయికి ఎదుగుతుండటం ప్రస్తుత వర్తమానం.

Rishi Sunak to Kamala Harris: బ్రిటిషర్లు మన భారత్‌ని ఏలడానికి... మన వాళ్లు వెళ్లి విదేశాలను పరిపాలించడానికి చాలా తేడా ఉంది. బ్రిటిషర్ల పరిపాలనకు భారతీయుల ఆమోదం లేదు. అది బలవంతపు పాలన. కానీ ఇప్పుడు మన భారతీయులు విదేశాల్లో అక్కడి ఓటర్ల ఓటు మద్దతుతో గెలిచి గద్దెనెక్కుతున్నారు. అందుకే వాళ్లు చరిత్ర సృష్టిస్తున్నారు. అలా చరిత్ర సృష్టించిన వాళ్ల జాబితాలో కేవలం బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ఒక్కరే లేదు.. ఆ జాబితాలో ఇంకొంత మంది ప్రపంచ నేతలకు స్థానం ఉంది. ఆ ప్రపంచ నేతలు ఎవరు, వాళ్లు పరిపాలించిన దేశాలు ఏంటనే డీటేల్స్ ఇప్పుడు చూద్దాం.

1 /5

యునైటెడ్ కింగ్‌డమ్ కొత్త ప్రధాని రిషి సునక్ రిషి సునక్ తల్లిదండ్రులు ఇద్దరూ భారతీయులే. తొలుత తూర్పు ఆఫ్రికాకు వెళ్లి అక్కడి నుండి 1960లలో బ్రిటన్ వెళ్లి స్థిరపడ్డారు. యునైటెడ్ కింగ్‌డమ్ కొత్త ప్రధాని రిషి సునక్ బ్రిటన్ ప్రధాని పీఠంపై కూర్చుంటున్న భారతీయుడు మాత్రమే కాదండోయ్.. గత 200 ఏళ్లకుపైగా చరిత్రలో ఆ దేశానికి ప్రధాని అయిన అతి పిన్న వయస్కుడు కూడా రిషినే. ప్రస్తుతం రిషి సునక్ వయస్సు 42 ఏళ్లు. ( Image Courtesy : IANS )

2 /5

అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారీస్ ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రభుత్వంలో వైస్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్న కమలా హ్యారీస్ భారత సంతతి మహిళనే అనే సంగతి మనందరికి తెలిసిందే. కమలా హ్యారీస్ క్యాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో జన్మించారు. కమలా హ్యారీస్ తల్లిదండ్రులు భారత్, జమైకా నుంచి అమెరికా వెళ్లి స్థిరపడ్డారు.Image Courtesy : Reuters

3 /5

ప్రవీణ్ జగన్నాథ్ .. మార్షియస్ ప్రధాని ప్రవీణ్ జగన్నాథ్ కూడా మన భారతీయ సంతతి వ్యక్తే. మార్షియస్ మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని అనిరూద్ జగన్నాథ్ తనయుడే ఈ ప్రవీణ్ జగన్నాథ్.( https://twitter.com/KumarJugnauth )

4 /5

ఆంటోనియో కోస్టా.. పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా కూడా భారత సంతతి మూలాలు ఉన్న నాయకుడే. ఇండో-పోర్చుగీస్ రచయిత ఓర్లాండి ఆంటోనియో ఫెర్నాండెజ్ డ కోస్టో తనయుడే ఆంటోనియో కోస్టా. ( Image Courtesy : https://twitter.com/antoniocostapm  )

5 /5

లియో వరద్కర్..  ఐర్లాండ్ రాజధాని డుబ్లిన్‌లో పుట్టిన లియో వరద్కర్ మన భారతీయ మూలాలు ఉన్న ఐర్లాండ్ నాయకుడే. లియో వరద్కర్ తండ్రి ముంబై నుండి 1960 లలోనే ఐర్లాండ్‌కి వలస వెళ్లారు. 2017 - 2020 మధ్య ఐర్లాండ్‌కి ఈయన 14వ ప్రధానిగా పనిచేశారు. ప్రస్తుతం ఐర్లాండ్ ప్రభుత్వం డిప్యూటీ హెడ్‌గా, వాణిజ్యం, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా సేవలు అందిస్తున్నారు.(Image courtesy : Reuters )