Modi Egypt Tour Higlights: అమెరికాలో మూడ్రోజుల పర్యటనను విజయవంతంగా ముగించుకున్న భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ తన విదేశీ యాత్రను కొనసాగిస్తున్నారు. అమెరికా నుంచి నేరుగా ఈజిప్టు పర్యటనకై  ఆ దేశ రాజధాని కైరోకు చేరుకున్న మోదీకు ఘన స్వాగతం పలికారు ఆ దేశ ప్రధాని ముస్తఫా మద్‌బౌలీ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారతదేశ ప్రధాని ఈజిప్టు దేశాన్ని సందర్శించడం 26 ఏళ్ల తరువాత ఇదే. అమెరికాలో మూడ్రోజులపాటు పర్యటించిన ప్రధాని మోదీ నేరుగా రెండ్రోజుల పర్యటనకై ఈజిప్టుకు వచ్చారు. ఈజిప్టు రాజధాని నగరం కైరోలో ప్రధాని మోదీకు ఆ దేశ ప్రధాని ఆహ్వానం పలుకగా, సంప్రదాయ బ్యాండ్ వాయిద్యంతో గార్డ్ ఆఫ్ హానర్ అందించారు. ఈజిప్టు దేశాధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ అల్ సిసితో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఈ పర్యటనతో ఇండియా-ఈజిప్టు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కాగలవని, అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ అల్ సిసితో చర్చలు ఫలప్రతమౌతాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 


ప్రధాని మోదీ ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ అల్ సిసితో రేపు ఆదివారం భేటీ కానున్నారు. అనంతరం ఆ దేశ కేబినెట్‌లోని భారత విభాగంతో ఈజిప్టు ప్రధానితో జరిగే రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరౌతారు. అనంతరం ఈజిప్టు దేశంలోని మేధావులతో చర్చలు జరపనున్నారు. 11వ శతాబ్దానికి చెందిన అల్ హకీమ్ మసీదును ప్రధాని మోదీ సందర్శించనున్నారు. 


Also Read: Joe Biden Gifted T-Shirt to PM Modi: ప్రధాని మోదీకి జో బైడెన్ స్పెషల్ టీషర్ట్ గిఫ్ట్.. దానిపై ఏం రాసి ఉందంటే..?


ఇదంతా ఓ ఎత్తైతే కైరోలో ప్రధాని బస చేసే హోటల్‌కు చేరుకోగానే అక్కడ ఎదురైన దృశ్యం మోదీను విశేషంగా ఆకట్టుకుంది. అక్కడి భారతీయ ప్రజలు మోదీ-మోదీ, వందేమాతరం నినాదాలిచ్చారు. భారతీయ సంప్రదాయ చీరకట్టులో ఉన్న ఓ ఈజిప్టు దేశ మహిళ షోలే చిత్రంలోని యే దోస్తీ హమ్ నహీ ఛోడేంగే పాట పాడటం మోదీని విపరీతంగా ఆకర్షించింది. ఇండియాకు తానెప్పుడూ రాలేదని ఆ మహిళ చెప్పడంతో మోదీ మరింత ఆశ్చర్యపడ్డారు. ఇంతకీ నువ్వు ఈజిప్టు కూతురివా లేదా ఇండియా కూతురివా అనేది ఎవరికీ తెలియదని చమత్కరించారు ప్రధాని మోదీ


Also Read: PM Modi US Visit: ప్రధాని మోదీకి జో బైడెన్ స్పెషల్ టీషర్ట్ గిఫ్ట్.. దానిపై ఏం రాశారంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook