COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

International Beer Day 2023: ప్రతి సంవత్సరం ఆగస్టు 4వ తేదిన 'అంతర్జాతీయ బీర్ డే 2023' ను జరుపుకుంటారు. అంతేకాకుండా కొన్ని దేశాలు ఆగస్టు మొదటి శుక్రవారం కూడా జరుపుకుంటారు. ఈ డేను మొదటిసారిగా కాలిఫోర్నియాలో సెలబ్రేట్‌ చేసుకున్నారు. అయితే బీర్‌ తయారీ కళ గురించి అందరికీ తెలియజేసే లక్ష్యంతో..ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సవరం జరిపేందుకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు లక్షలాది మంది బీర్‌ను తాగుతున్నారు. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన డ్రింక్‌లో ఇది ఒకటి. అయితే ఈ బీరును కొంతమంది ప్యాషన్‌తో తాగితే..మరికొంత మంది శరీర సమస్యలు దూరమవుతాయని తాగుతున్నారు. ప్రస్తుతం చాలా మంది బీర్‌ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయని గుడ్డిగా నమ్మకంతో తాగుతూ ఉన్నారు. నిజంగా బీర్‌ తాగడం వల్ల శరీరానికి లాభాలు కలుగుతాయా? అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందా? బీర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


బీర్‌కి సంబంధించిన అపోహలు, నిజాలు:
బీర్‌ శరీర బరువును పెంచుతుందా?:

dbearexchange.io పరిశోధనల ప్రకారం..చాలా మంది బీర్‌ తాగడం వల్ల లావుగా మారతారని నమ్ముతూ తాగుతూ ఉంటారు. అయితే నిజానికి  బీర్లలో కేలరీలు, కార్బోహైడ్రేట్ల అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు పరిమిత పరిమాణంలో బీర్‌ తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా బరువు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. కొన్ని బీర్లు  క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా నివారిస్తాయి. 


Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా


బీర్ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా?:
బీర్ తాగడం ఆరోగ్యానికి హానికరం అని కొందరు అనుకుంటారు. ఇది ముమ్మాటికి తప్పని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బీర్‌ను పరిమిత పరిమాణంలో తీసుకోవడం వల్ల శరీరానికి లాభాలు కలుగుతాయని, అతిగా తీసుకోవడం మంచిది కాదని నిపుణులు తెలుపుతున్నారు. అతిగా తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. తరచుగా పరిమితంగా తీసుకునేవారిలో జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిందని నిపుణులు చెబుతున్నారు. 


బీర్ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు కరుగుతాయా?:
బీర్ తాగడం వల్ల కిడ్నీలో ఉన్న రాళ్లపై పరోక్షంగా ప్రభావం పడుతుందని..కొంతమందిలో ఎక్కువ మూత్రవిసర్జన కారణంగా చిన్న చిన్న రాళ్లు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.  పెద్ద పరిమాణంలో ఉన్న కిడ్నీ స్టోన్‌ కరగడం చాలా కష్టమని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు అతిగా బీర్‌ తాగడం మానుకోవాలి. 


Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook