International Yoga Day 2023 Theme: ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తేదీన జరుపుకుంటారు. యోగ ఎన్నో శతాబ్దాలకు పూర్వం భారతదేశంలో గుర్తింపు పొంది.. చివరకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అందుకే యోగాను భారతదేశానికి పుట్టినిల్లుగా భావిస్తారు. యోగా చేయడం వల్ల ఎన్ని రకాలు ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ప్రతిరోజు చేయడం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యోగా దినోత్సవం ఎలా ప్రారంభమైంది:
2014 సంవత్సరంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ యోగాకు ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని ఐక్యరాజ్యసమితి సమావేశంలో యోగా దినోత్సవం గురించి చర్చించారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు యోగా ప్రాముఖ్యత తెలిసేలా ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని రాజ్యసమితి వేదికగా ప్రధాని కోరారు. దీనికి అన్ని దేశాలు ఆమోదం తెలుపగా.. 2015 సంవత్సరం నుంచి యోగా దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నారు.


Also read : Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
ప్రతిరోజు యోగా చేయడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా శరీరం యాక్టివ్ గా ఉండడమే కాకుండా ఫిట్ గా తయారవుతుంది. యోగ మానసిక ఆరోగ్యానికి, శరీర దృఢత్వానికి ఎంతో సహాయపడుతుంది. ముఖ్యంగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు, తరచుగా పొట్ట సమస్యలతో ఇబ్బంది పడేవారు తప్పకుండా యోగాసనాలు వేయాలి. ఇలా చేయడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా కండరాల బలహీనత, శరీర బలహీనత సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని ప్రత్యేక ఆసనాలు వేయాలి.


యోగ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?:
యోగా దినోత్సవం ఈ సమయంలోనే జరుపుకోవడానికి ప్రధాన కారణాలు అంటే చాలా ఉన్నాయి. ఈ తేదీ ఉత్తరార్థ గోళంలో పొడవైన రోజుగా ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తారు. అయితే ఇదే క్రమంలో సూర్యుడు దక్షిణాయనం దిశలో ఉంటాడు. ఈ దక్షిణాయనం దిశ విజయానికి తొలిమెట్టుగా నిపుణులు పేర్కొన్నారు. అందుకే ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన కేవలం దక్షిణాయనం దిశలు యోగా చేయాలని నిపుణులు సూచిస్తారు.


అంతర్జాతీయ యోగా దినోత్సవ థీమ్:
ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్ విడుదల చేస్తుంది. ఈ సంవత్సరం థీమ్.. వసుదైక కుటుంబానికి యోగ(vasdhaiv kutumbakam).. అంటే ఆరోగ్యవంతమైన కుటుంబాన్ని పొందడానికి యోగా చేయాలని ఈ థీమ్ అర్థం.


Also read : Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook