న్యూఢిల్లీ: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు ఉచ్చు బిగుసుకుంటోంది. నిత్యానంద ఆచూకీ చెప్పాలని ప్రపంచ దేశాలను కోరుతూ ఇంటర్ పోల్ ఏజెన్సీ బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది. భారత్‌లో నిత్యానందపై అత్యాచారం, అపహరణ కేసులున్నాయని నకిలీ పాస్‌పోర్ట్‌పై విదేశాలకు పారిపోయి తలదాచుకుంటున్నాడని తమ నోటీసులలో ఇంటర్ పోల్ పేర్కొంది. గుజరాత్ పోలీసుల విజ్ఞప్తి మేరకు దైవాంశ సంభూతుడిగా ప్రచారం చేసుకునే నిత్యానందపై నోటీసులు జారీ అయ్యాయి.  నకిలీ పాస్‌పోర్టుపై విదేశాలకు చెక్కేశాడని కర్ణాటకలో కేసు నమోదైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Aso Read: భర్త మంచివాడే, కానీ.. విడాకులపై స్పందించిన శ్వేతాబసు


వాస్తవానికి నిత్యానందకు 2008లో 10ఏళ్ల వ్యాలిడిటీతో పాస్ పార్ట్ జారీ చేశారు. 2018లో పాస్ పోర్ట్ గడువు ముగిసింది. అయితే అత్యాచారం, అహ్మదాబాద్ లోని యోగిని సర్వజ్ఞపీఠం ఆశ్రమంలో బాలికలను లైంగికంగా వేధించాడని, ఇద్దరు బాలికలు అదృశ్యం కావడం కేసులు నమోదయ్యాయి. కేసులకు భయపడి నిత్యానంద నకిలీ పాస్‌పోర్టుతో విదేశాలకు పారిపోయాడు. నిత్యానందర తమ దేశంలో లేడని, అతడికి ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించినట్లు ఈక్వెడార్ అధికారులు తెలిపారు. మరోవైపు కైలాస అనే ద్వీపాన్ని (దేశాన్ని) నిత్యానంద ఏర్పాటు చేసినట్లు కథనాలు వెలుగుచూశాయి.


Also Read: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆస్తుల విలువెంతో తెలుసా? 


4 లక్షల డాలర్ల మోసానికి సంబంధించిన కేసులో భాగంగా ఫ్రాన్స్ పోలీసులు నిత్యానందను అదుపులోకి తీసుకుని విచారించాలని భావిస్తున్నారట. నిత్యానంద ప్రస్తుతం తమ దేశంలో లేడని, హైతీలో తలదాచుకుంటున్నాడని ఈక్వెడార్ ఎంబసీ చెబుతోంది. కాగా, ఓ దీవిని కొని దానికి కైలాస అనే దేశమని నామకరణం చేసినట్లు కొన్ని నెలల కిందట వార్తలు, ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..