Pegasus Spyware: ఇండియాలో కలకలం రేపుతున్న వివాదాస్పద పెగసస్ స్పైవేర్‌పై సొంతదేశంలో విచారణ ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సాఫ్ట్‌వేర్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో ఇజ్రాయిల్ రక్షణ శాఖ దర్యాప్తు ప్రారంభించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెగసస్ స్పైవేర్(Pegasus Spyware). ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేపుతున్న సాఫ్ట్‌వేర్. ఇండియా సహా పలుదేశాలు ఈ స్పైవేర్ సాఫ్ట్‌వేర్‌ను ప్రత్యర్ధులు, జర్నలిస్టులపై నిఘా కోసం ఉపయోగిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియాలో పెగసస్ రేపిన ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో పెగసస్ స్నూపింగ్ స్కామ్ విషయమై ఎన్ఎస్ఓ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై ఇజ్రాయిల్ రక్షణ శాఖ దర్యాప్తు ప్రారంభించింది. ఎన్ఎస్ఓ గ్రూప్(NSO Group) కార్యాలయంలో తాజాగా తనిఖీలు నిర్వహించినట్టు ఇజ్రాయిల్ రక్షణ శాఖ (Izrael Defence Ministry)వెల్లడించింది. అయితే తనిఖీల్లో వివరాల్ని బయటపెట్టలేదు. ఈ తనిఖీల్లో ఇజ్రాయిల్ రక్షణ శాఖతో పాటు జాతీయ భద్రతా మండలి అధికారులు కూడా పాల్గొన్నారు.రక్షణ శాఖ ఎక్స్‌పోర్ట్ కంట్రోల్ డివిజన్ ఇచ్చిన అనుమతుల ప్రకారం ఎన్ఎస్ఓ గ్రూప్ పనిచేస్తుందా లేదా అనేది తేల్చడానికి తనిఖీలు చేసినట్టు తెలుస్తోంది. కాగా దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని..ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తి పారదర్శకతతో పనిచేస్తున్నామని ఎన్ఎస్ఓ గ్రూప్ ప్రతినిధులు స్పష్టం చేశారు. 


Also read: బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో భారీగా ఎర్రచందనం పట్టివేత


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook