Red Sandal: విమానాశ్రయాలు అక్రమ రవాణాకు అడ్డాగా మారుతున్నాయి. అక్రమార్కులు ఎత్తుకు పైఎత్తు వస్తూ రవాణాకు కొత్త మార్గాలు అణ్వేషిస్తుంటే..కస్టమ్స్ అధికారులు చిత్తు చేస్తున్నారు.
దక్షిణాదిన హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌లు అక్రమ రవాణాకు కేరాఫ్‌గా మారుతున్నాయి. బంగారం యధేచ్ఛగా రవాణా అవుతూనే ఉంది. కొన్ని పట్టుబడుతుంటే..మరికొన్ని తప్పించుకుని అక్రమంగా రవాణా అవుతున్న పరిస్థితి. ఇప్పుడు అదే కోవలో ఓ అక్రమ వ్యాపారి ఏకంగా ఎర్రచందనం (Red Sandal Smuggling)తరలించేందుకు పక్కా ప్లాన్ వేశాడు.విజయవంతమయ్యేవాడే గానీ కొద్దిలో దొరికిపోయాడు. ముంబైకు చెందిన ఓ వ్యాపారవేత్త దుబాయ్‌కు అక్రమంగా ఎర్రచందనం తరలించాలనుకున్నాడు. దుంగల్ని ముక్కలు చేసి..చెక్కపెట్టెల్లో పెట్టి ప్యాక్ చేశాడు.బెంగళూరులోని ఓ ఏజెన్సీ ద్వారా కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్‌కు(Bengaluru Airport) తరలించాడు. ఇనుప పైపుల్ని ఎగుమతి చేస్తున్నట్టుగా ఎయిర్‌కార్గో కస్టమ్స్ అధికారుల్ని నమ్మించాడు. అయితే ఇనుప పైపులకు పగడ్బందీ ప్యాకింగ్ ఏంటనే అనుమానంతో తనిఖీ చేయగా..ఎర్రచందనం బయటపడింది. దీని విలువ దాదాపు 6 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఎయిర్‌పోర్ట్ అధికారులు ఫిర్యాదు చేయగా..నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
Also read: ట్విట్టర్‌లో 7 కోట్లమంది ఫాలోవర్లతో రికార్డు సృష్టించిన ప్రధాని నరేంద్ర మోదీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో భారీగా ఎర్రచందనం పట్టివేత