Jalianwala Bagh: జలియన్ వాలాబాగ్ ఊచకోత. సామూహిక కాల్పుల దురాగతం. ఏ చరిత్రా ఎప్పటికీ క్షమించని మహా అపరాధం. బ్రిటీషు తెల్లదొరలపై ఎప్పటికీ మాయనిమచ్చే. నాటి ఆ ఘోరానికి నేడు ప్రతీకారమా..ఏం జరిగింది అసలు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ చరిత్రలోనే కాదు..ప్రపంచ చరిత్రలో కూడా అంతటి విషాదం మరొకటుండదు. బ్రిటీషుకు వ్యతిరేకంగా ఉద్యమించిన భారతీయులపై జనరల్ డయ్యర్ రూపంలో విరుచుకుపడిన దుర్మార్గమది. 2019 ఏప్రిల్ 13వ తేదీన అమృతసర్‌లోని జలియన్ వాలాబాగ్‌లో భారత స్వాతంత్ర్య సమరయోధులైన డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ, డాక్టర్ సత్యపాల్ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనకు దిగిన వేలాదిమందిపై జరిపిన సామూహిక హత్యాకాండ. ఊచకోత. ఒక్కసారిగా ఆ గ్రౌండ్‌లో చేరుకున్న బ్రిటీషు సైనికులు కాల్పులు ప్రారంభించారు. దాదాపు 12 వందలమంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. వందలాదిమంది క్షతగాత్రులయ్యారు. ఈ దురాగతం జరిగి 102 ఏళ్లైపోయింది. ఇప్పుడు ఆ ఘటనకు ప్రతీకారం తలపెట్టారా..అసలేం జరిగింది.


బ్రిటీషు రాణి ఎలిజబెత్‌ను (Queen Elizabeth) హత్య చేసేందుకు ఓ యువకుడు ప్రయత్నించిన ఘటన ఇది. స్కాట్లండ్ పోలీసులు జస్వంత్ సింగ్ అనే 19 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. అసలు రాణి ఎలిజబెత్‌ను ఎందుకు చంపాలనుకున్నాడనే విషయంపై ఆ యువకుడు చెప్పిన కారణం వినీ స్కాట్లండ్ పోలీసులు ఆశ్చర్యపోయారు. రాణి ఎలిజబెత్ హత్యకు ప్రయత్నించే ముందు స్నాప్‌చాట్‌లో ఓ వీడియో కూడా పోస్ట్ చేశాడా యువకుడు. తానొక భారతీయ సిక్కు అని చెప్పాడు. బ్రిటన్ రాణి ఎలిజబెత్‌ను చంపేందుకు వచ్చానన్నాడు. 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ (Jalianwala Bagh) ఘటనకు ప్రతీకారంగా రాణిని చంపుతానని చెప్పుకొచ్చాడు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా విండర్స్ క్యాజిల్ రాజ ప్రసాదానికి రాణి ఎలిజబెత్ చేరుకున్నారు. జస్వంత్ సింగ్ ఓ విల్లు పట్టుకుని అక్కడికి వెళ్లడంతో..పోలీసులు అరెస్టు చేశారు. ఆ యువకుడి మానసిక స్థితిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మానసిక వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు.


Also read: Dual mode vehicle: వామ్మో.. రోడ్డుపైనే కాదు.. రైలు పట్టాలపైనా రయ్యుమని దూసుకెళ్లే వాహనం వచ్చేసింది..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook