Dual mode vehicle: ప్రపంచంలోనే తొలి డ్యూయల్ మోడ్ వాహనాన్ని (dual-mode vehicle) అందుబాటులోకి తీసుకొచ్చింది జపాన్ (Japan). ఈ డీఎంవీ (DMV) వాహనం ఒక మినీ బస్సు, మినీ రైలు మాదిరిగా ఉంటుంది. ఈ వాహనం పై రోడ్డుపైనే నడుస్తోంది. రైలు పట్టాలపై కూడా పరుగులు తీస్తుంది. దీనిని క్రిస్మస్ రోజున కైయో (Kaiyo) నగరంలో ప్రారంభించారు.
సాధారణంగా ఈ వాహనం రబ్బరు టైర్లతో సంప్రదాయ రోడ్లపై నడుస్తుంది. అయితే ఇంటర్ ఛేంజ్ స్టేషన్ లలో ఈ వాహనం ముందున్న స్టీల్ వీల్స్ బయటకు వస్తాయి. దీంతో ముందుభాగంలోని రబ్బరు టైర్లు కాస్త ఎత్తులో పైకి లేస్తాయి. వెనుక రబ్బరు టైర్లు డీఎంవీని రైలు పట్టాలపైకి నెట్టుతాయి.
Also Read: Hair Cut in Space: అంతరిక్షంలో హెయిర్ కటింగ్, వీడియో వైరల్
ఈ డీఎంవీ వాహనం రైలు పట్టాలపై గంటకు 60 కిలోమీటర్ల వేగంతో, రోడ్డుపై వంద కిలోమీటర్లకుపైగా వేగంతో ప్రయాణిస్తుందని జపాన్‌కు చెందిన ఆసా కోస్ట్ రైల్వే (Asa Coast Railway ) వెల్లడించింది. డీజిల్‌తో నడిచే ఈ రైలు కమ్ బస్సులో 20 మంది వరకూ ప్రయాణం చేయవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు రవాణా సదుపాయాన్ని అందించడంలో ఇది ఎంతో ఉపయోగపడనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook