అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బరువు ఆయన ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయడం లేదని తాను భావిస్తే.. ట్రంప్ నడిపే ట్రస్టుకు లక్ష డాలర్లు బహుమతి అందిస్తానని బహిరంగ ప్రకటన చేశారు హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ గన్. డొనాల్డ్ ట్రంప్‌కు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయని.. ఇటీవలి కాలంలో ఆయన రెగ్యులర్‌గా అస్వస్థతకు గురవుతున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా ట్రంప్ మానసిక సమస్యలతో బాధపడుతున్నారని వార్తలు వచ్చిన క్రమంలో ఆయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు వాల్టర్‌ రీడ్‌ నేషనల్‌ మిలిటరీ మెడికల్‌ సెంటర్‌ వైద్యులు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని తెలిపారు వైద్యులు. ట్రంప్ 6 అడుగుల 3 అంగుళాలు ఉన్నారని.. అలాగే ఆయన బరువు 239 పౌండ్లు ఉందని కూడా వైద్యులు నిర్థారించారు.


అయితే వైద్యుల ప్రకటనపై జేమ్స్ గన్ పెదవి విరిచారు. "ఆ వైద్యులు ఇచ్చిన రిపోర్టు సరిగ్గా లేదు. ట్రంప్ ఒప్పుకుంటే నేనే స్వయంగా ఆయనకు దగ్గరుండి.. కొందరు మేటి వైద్యులచేత ఆరోగ్య పరీక్షలు చేయిస్తాను. ఆయన ఆరోగ్యం నిజంగానే బాగుందని తేలిస్తే... ట్రంప్ తరఫున సేవా కార్యక్రమాలు చేసే ట్రస్టుకి లక్ష డాలర్లు విరాళంగా ఇస్తాను" అని జేమ్స గన్ అన్నారు.