అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. అమెరికా చరిత్రలో తొలిసారిగా ఆఫ్రో అమెరికన్‌ను రక్షణ శాఖ మంత్రిగా ఎన్నుకుని సంచలనం రేపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ( America president Elections ) ముందు దేశంలో జరిగిన జాత్యాహంకార ఘర్షణలు అమెరికాను అట్టుడికించాయి. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald trump ) ఈ ఘర్షణల్ని మరింతగా పెంచారనే ఆరోపణలున్నాయి. ఈ నేపధ్యంలో అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ ( Joe Biden ) సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఒక ఆఫ్రో అమెరికన్‌ను అత్యున్నతమైన రక్షణ శాఖ మంత్రిగా ఎన్నుకున్నారు. బరాక్ ఒబామా ( Barack obama ) హయాంలో మద్యప్రాచ్యంలోని అమెరికన్ దళాలకు నేతృత్వం వహించిన రిటైర్డ్ జనరల్ లాయిడ్ ఆస్టిన్‌ని ఈ అత్యున్నత పదవికి జో బిడెన్ ఎన్నుకున్నారు. 


2003లో బాగ్దాద్ లోని అమెరికా దళాలకు సారధ్యం వహించి..యూఎస్ సెంట్రల్ కమాండ్‌కు అధిపతి అయ్యారు ఆస్టిన్. కేబినెట్‌లో మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఆస్టిన్‌ను జో బిడెన్ ఎంపిక చేశారు. త్వరలోనే ఆస్టిన్ నియామకాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే ఈ ఎన్నికకు సెనేట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది.  


అమెరికన్ ఆర్మీ ( American Army )కు 4 దశాబ్దాల పాటు సేవలందించిన ఆస్టిన్..బరాక్ ఒబామాతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. 2016లో మిలట్రీ నుంచి రిటైరైన తరువాత..రేథియాన్ టెక్నాలజీస్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లలో చేరారు. Also read: Uk vaccination: అక్కడికి వెళితే..వ్యాక్సినేషన్ ఫ్రీగా చేస్తారా