Vice President Kamala Harris held presidential powers temporarily: భారత మూలాలున్న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్​ ఆ దేశానికి కొద్ది సేపు అధ్యక్షురాలిగా (Kamala Harris) వ్యవహరించారు. జో బైడెన్​కు (US president Joe biden) వైద్య పరీక్షల కారణంగా తాత్కాలికంగా అమెకు అధ్యక్ష బాధ్యతలు బదిలీ చేశారు.. జో బైడెన్​.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీనితో శుక్రవారం గంట 25 నిమిషాలపైటు అధ్యక్ష పదవిలో ఉన్నారు కమలా హారీస్​. స్పష్టంగా చెప్పాలంటే.. శుక్రవారం ఉదయం 10.10 నిమిషాల నుంచి 11.35 నిమిషాల వరకు ఆమె ఆ పదవిలో ఉన్నారు.


అమెరికా చరిత్రలో తొలిసారి..


తాత్కాలికమే అయినా.. అమెరికా చరిత్రలో కొత్త పేజీని లిఖించారు కమలా హారీస్​. అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.


ఇప్పటికే అమెరికా మహిళా ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన తొలి మహిళగా కూడా కమలా హారిస్​ రికార్డు నెలకొల్పారు.


Also read: డ్రంక్ అండ్ డ్రైవ్​ సమస్యకు సాంకేతిక పరిష్కారం.. ఇక ప్రమాదాలకు చెక్!


Also read: సంచలనం: మహిళతో సెక్స్ చాటింగ్.. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్సీకి రాజీనామా చేసిన పైన్!


బదలాయింపు ఎందుకంటే..


అధ్యక్షుడు అనస్థీసియాలో ఉన్నంత సేపు అధికార బాధ్యతలను ఉపాధ్యక్ష పదవిలో ఉన్నవారికి తాత్కాలికంగా బదిలీ చేయాలని అమెరికా రాజ్యంగం చెబుతోంది.


అయితే జో బైడెన్​కు శుక్రవారం కాలనోస్కోపి పరీక్ష నిర్వహించారు. పెప్ద పేగుగు సంబంధించి ఆయనకు ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆయనకు అనస్థీసియా ఇస్తారు వైద్యులు. ఈ నేపథ్యంలో అనస్థీసియాలో ఉన్నంత సేపు కమలా హారీస్​కు అధ్యక్ష బాధ్యతలు బదలియించారు.


కమలా హారిస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరించనున్నట్లు వైట్​ హౌస్ అధికారికంగా ప్రకటించింది. జో బైడెన్ నవంబర్ 20న (శనివారం) 79వ పుట్టినరోజు జరుపుకోనున్నారు.


Also read: విజృంభిస్తున్న కరోనా కేసులు...ఆ దేశంలో మళ్లీ లాక్‌డౌన్...!


గతంలో కూడా ఇలానే..


అమెరికా మాజీ అధ్యక్షుడు జార్డ్​ బుష్​ కూడా గతంలో ఇలానే చేశారు. ఆయన అధ్యక్షుడుగా ఉన్నప్పుడు.. కాలనోస్కోపీ పరీక్షల నిమిత్తం 2002, 2007 సంవత్సరాల్లో అధ్యక్ష బాధ్యతలను ఉపాధ్యక్షుడికి బదిలీ చేశారు.


Also read: ప్రముఖ ర్యాపర్ ను కాల్చి చంపిన దుండగుడు, అమెరికాలో ఘటన


Also read: భూమికి పొంచి ఉన్న ముప్పు, ఆ ఆస్టరాయిడ్ భూమిని ఢీ కొట్టనుందా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook