Karachi Terrorist Attack: పోలీసు కార్యాలయంపై తాలిబన్ల దాడి.. కరాచీలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం!
Taliban Terrorists attack Polce Chiefs Office in Karachi. శుక్రవారం పాకిస్తాన్ తాలిబాన్ యోధులు భారీగా ఆయుధాలు ధరించి కరాచి పోలీస్ ప్రధాన కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.
Taliban Terrorists attack Polce Chiefs Office in Karachi: పొరుగు దేశం పాకిస్థాన్‌లో తాలిబన్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శుక్రవారం పాకిస్తాన్ తాలిబాన్ యోధులు భారీగా ఆయుధాలు ధరించి.. కరాచి పోలీస్ ప్రధాన కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులో పాటు మరో ఏడుగురు చనిపోయారని సింధ్ ప్రభుత్వ ప్రతినిధి ముర్తాజా వహాబ్ సిద్ధిఖీ ఓ ప్రకటనలో తెలిపారు. ముగ్గురు ఉగ్రవాదులను చంపడంతో ఆపరేషన్ ముగిసిందని ఆయన పేర్కొన్నారు.
పోలీసు దుస్తులు ధరించిన తాలిబాన్ యోధులు శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో పోలీస్ ప్రధాన కార్యాలయ భవనం వెనుక నుంచి దాడి చేశారు. ముందు గేటు నుంచి ఇద్దరు గ్రనేడ్లు విసురుతూ లోనికి ప్రవేశించారు. అనంతరం విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అయితే ఈ దాడిని పారామిలటరీ రేంజర్లు, పోలీసులు ప్రతిఘటించారు. ఇరు వైపులా జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు, మరో నలుగురు మృతి చెందారు.
ఈ దాడిలో ఇద్దరు పోలీసులు, ఒక రేంజర్ మరియు ఒక శానిటరీ వర్కర్‌తో సహా నలుగురు మరణించారు. దాడి జరిగిన సమయంలో ఉన్నత అధికారులు కార్యాలయంలో ఉన్నట్లు సమాచారం. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ ప్రతినిధి వాట్సాప్ సందేశం ద్వారా ఈ దాడికి బాధ్యత వహించాడు. మా ముజాహిదీన్ అమరవీరులు కరాచీ పోలీసు కార్యాలయంపై దాడి చేశారు అని అతడు ట్వీట్ చేశాడు. ఈ దాడి నేపథ్యంలో కరాచీలో ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది.
హింసను అణిచివేస్తామని ప్రధాని షెహబాజ్ షరీఫ్ శుక్రవారం పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే తమ లక్ష్యం అని అన్నారు. పోలీసులు ఉన్నతాధికారులే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. గత నెల రోజులుగా పాకిస్థాన్‌లో వరుస ఉగ్రదాడులు జరుగుతున్నాయి. గత జనవరిలో మసీదులో మధ్యాహ్నం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో వంద మందికి పైగా మృతిచెందారు.
Also Read: Mohammed Shami: మొహ్మద్ షమీ చెవులు పిండిన ఆర్ అశ్విన్.. నొప్పితో విలలాడిన భారత పేసర్! వైరల్ ఫోటో
Also Read: Andrea Jeremiah Pics: సిక్స్ ప్యాక్‌లో ఆండ్రియా జర్మియా.. పిక్స్ చూస్తే పిచ్చెక్కిపోవడం పక్కా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.