కేఎఫ్‌సీలు బంద్.. వారం వరకు ఇలానే
చికెన్ కొరతతో కేఎఫ్‌సీ రెస్టారెంట్లు మూతబడ్డాయి.
చికెన్ కొరతతో కారణంగా యూకేలో వందలాది కేఎఫ్‌సీ రెస్టారెంట్లు మూతబడ్డాయి. ఇప్పటి వరకు చికెన్‌ను సరఫరా చేస్తున్న జర్మనికి చెందిన ప్రముఖ కొరియర్ సంస్థ డీహెచ్‌ఎల్‌తో కేఎఫ్‌సీలు ఒప్పందం రద్దుచేసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
‘ఇటీవల ఓ కంపెనీతో ఒప్పందం చేసుకున్నాం. ఆ కంపెనీ సరఫరాలో కొన్ని సమస్యలు వచ్చాయి. యూకే వ్యాప్తంగా ఉన్న 900 రెస్టారెంట్లకు చికెన్ సరఫరా చేయడం కష్టమైంది. ఈ క్రమంలోనే కొన్ని రెస్టారెంట్లు మూతపడాల్సి వచ్చింది’ అని కేఎఫ్‌సీ ఓ ప్రకటనలో తెలిపింది.
నాణ్యత విషయంలో కంపెనీ రాజీ పడదని, ఈ వారం చివరి వరకు ఇలానే మూసివేసుంటాయని కంపెనీ ప్రకటించింది. మిగిలిన రెస్టారెంట్లలో పరిమిత మెనూ, కొన్ని గంటలే సేవలందిస్తున్నట్లు తెలిపింది. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది.