Kiribati Islands first to Welcomes New Year 2023: ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సరం 2023 వేడుకలు అంబరాన్నంటాయి. భారత దేశ ప్రజలు కొత్త  ఏడాది కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఇప్పటికే కొన్ని దేశాలు నూతన సంవత్సరాన్ని ఆహ్వానించాయి. అందరికంటే ముందుగా పసిఫిక్‌ మహా సముద్రంలోని కిరిబాటి దీవులు కొత్త ఏడాది 2023ని స్వాగతించాయి. వాస్తవానికి ప్రతి సంవత్సరం ‘సమోవా’ ద్వీపం కొత్త ఏడాదిని అందరి కంటే ముందుగా ఆహ్వానిస్తుంటుంది. అయితే ఈసారి టైమ్‌ జోన్‌ను మార్చుకోవడంతో.. ఎప్పటికంటే గంట ఆలస్యంగా కొత్త ఏడాదిని ఆహ్వానించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

న్యూజిలాండ్‌ ప్రజలు కూడా 2023కి ఇప్ప్పటికే ఆహ్వానం పలికారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు న్యూజిలాండ్‌ దేశం కొత్త ఏడాదిని స్వాగతించింది. ఆక్లాండ్‌ స్కై టవర్‌ వద్ద న్యూఇయర్‌ వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. బాణసంచా వెలుగులతో స్కైటవర్‌ వర్ణ సందడి వాతావరణం నెలకొంది. కివీస్‌ ప్రజలు నూతన సంవత్సరాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. భారత్ కంటే 5.30 గంటల ముందుగా ఆస్ట్రేలియా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోనుంది. సిడ్నీ హార్బర్ బ్రిడ్జి వద్దకు లక్షలాది మంది చేరుకుని న్యూఇయర్ వేడుకలకు సిద్ధంగా ఉన్నారు. 


భారత్ కంటే మూడున్నర గంటల ముందే జపాన్‌ 2023లోకి అడుగుపెడుతుంది. ఇదే సమయానికి దక్షిణ కొరియా, ఉత్తరకొరియా దేశాలు కూడా కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తాయి. భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ మనకంటే 30 నిమిషాల ముందు కొత్త సంవత్సరంలోకి వెలుతాయి. సమోవాలో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమైన 8. గంటలకు భారత్ ప్రజలు 2023లోకి అడుగుపెడతారు. అదే సమయానికి  శ్రీలంక వాసులు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటారు. 


భారత్ తర్వాత సుమారు నాలుగున్నర గంటలకు 43 దేశాలు ఒకేసారి కొత్త ఏడాది 2023కి స్వాగతం పలుకుతాయి. నార్వే, ఫ్రాన్స్‌, ఇటలీ లాంటి ఐరోపా దేశాలు.. కాంగో, అంగోలా, కామెరూన్‌ లాంటి ఆఫ్రికా దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. భారత్‌ తర్వాత 5.30 గంటలకు ఇంగ్లండ్‌లో న్యూఇయర్‌ మొదలవుతుంది. భారత కాలమానం ప్రకారం... జనవరి 1 ఉదయం 10.30 గంటలు అయినప్పుడు అమెరికాలోని న్యూయార్క్‌ కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతుంది. 


Also Read: Virat Kohli Dubai: దుబాయ్ వెకేషన్.. తెగ ఎంజాయ్ చేస్తున్న అనుష్క శర్మ, విరాట్‌ కోహ్లీ! వైరల్ పిక్స్   


Also Read: Rishabh Pant IPL 2023: కోలుకోవడానికి కనీసం ఆరు నెలలు.. ఐపీఎల్ 2023, ఆస్ట్రేలియా సిరీస్‌కు పంత్ దూరం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.