పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్- ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునిర్ నియమితులయ్యారు. ఐఎస్ఐ నూతన డైరెక్టర్ జనరల్(డీజీ)గా అసిమ్ మునీర్‌ను నియమించినట్లు పాకిస్థాన్ ఆర్మీ ప్రకటించిందని పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ డాన్ న్యూస్ పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెప్టెంబర్‌లో పాక్ సైన్యం మునీర్ పదోన్నతిని ఆమోదించిందని, ఆయనతో పాటు మరో ఐదుగురు ఇతర ప్రధాన సైన్యాధికారుల స్థాయిని లెఫ్టినెంట్ జనరల్ స్థాయికి పెంచిందని డాన్ నివేదికలు పేర్కొన్నాయి.


మాజీ ఐఎస్ఐ డీజీ లెఫ్టినెంట్ జనరల్ నవీద్ ముక్తార్ రిటైర్మెంట్ అక్టోబర్ 1న జరిగిందని వెల్లడించిన రిపోర్టులు.. తదుపరి ఐఎస్ఐ డీజీ మునీర్ అవుతారని ఊహాగానాలు వెలువడ్డాయని.. ఆ ఊహాగానమే చివరకు నిజమైందని తెలిపింది.


డాన్ న్యూస్ ప్రకారం.. ఈ బాధ్యతలకు ముందు మునీర్ మిలిటరీ ఇంటలిజెన్స్ డీజీగా ఉన్నారు. ఫోర్స్ కమాండ్ నార్తన్ ఏరియాస్ కమాండర్‌గా పనిచేసిన ఆయన 2018 మార్చిలో హిలాల్-ఐ-ఇంతియాజ్ అందుకున్నారు.


లెఫ్టినెంట్ జనరల్ అజ్‌హర్ సలేహ్ అబ్బాసి జనరల్ హెడ్ క్వార్టర్స్‌లో లాజిస్టిక్స్ స్టాఫ్ చీఫ్‌గా, లెఫ్టినెంట్ జనరల్ నదీం జాకీ పెషావర్ కార్ప్స్ కమాండర్‌గా, లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్ అజీజ్ GHQ సైనిక కార్యదర్శిగా, లెఫ్టినెంట్ జనరల్ ముహమ్మద్ అద్నాన్ వైస్ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్‌గా,  లెఫ్టినెంట్ జనరల్ వసీం అష్రాఫ్ ఆర్మ్స్ ఐజీగా నియమితులయ్యారని డాన్ పేర్కొంది.