Earthquake in Turkey, Syria LIVE Updates: టర్కీ, సిరియాలో 15 వేల మందికి పైగా మృతి.. సహాయ చర్యలకు దిగిన భారత సైన్యం!
Earthquake in Turkey, Syria LIVE Updates: టర్కీ, మిడిల్ ఈస్ట్ దేశాల్లో భూకంపం విధ్వంసం సృష్టించింది. టర్కీ, సిరియాలో భూకంపం కారణంగా చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.9గా నమోదైంది.
Earthquake in Turkey, Syria LIVE Updates: టర్కీ, మిడిల్ ఈస్ట్ దేశాల్లో భూకంపం విధ్వంసం సృష్టించింది. టర్కీ, సిరియాలో భూకంపం కారణంగా చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.9గా నమోదైంది. దాదాపు 7700 మందికి పైగా మరణించగా.. వారికి సహాయం చేసే క్రమంలో మరో భూకంపం సంభవించడంతో.. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దశాబ్ద కాలంలో ఎదుర్కొన్న అతిపెద్ద విపత్తు అని అధ్యక్షుడు ఎర్డోగాన్ పేర్కొన్నాడు. వేగంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ యూనిట్‌లను నియామించారని తెలిపారు.
Latest Updates
విమానాశ్రయాలు, కీలక నౌకాశ్రయాలు దెబ్బతినడంతో ప్రపంచ దేశాల సాయం టర్కీ, సిరియాలకు చేరడం కష్టతరంగా మారింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడటానికి విలువైన 72 గంటల కాలం ముగిపోయింది. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి.
టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపం కారణంగా ఇప్పటివరకు 15 వేల మందికి పైగా మరణించారు. అసోసియేటెడ్ ప్రెస్ ఈరోజు ప్రకటించింది. సహాయక బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రపంచంలోని 24 దేశాలకు చెందిన రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో భాగం అయ్యాయి. టర్కీలో భారత సైన్యం, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఫీల్డ్ ఆసుపత్రులను ఏర్పాటు చేసి క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.
టర్కీ, సిరియా దేశాల్లో మృత్యుఘోష కొనసాగుతోంది. భారీ భూకంపం దాటికి రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది. టర్కీ, సిరియాల్లో మృతుల సంఖ్య దాదాపుగా 12 వేలకు చేరింది.
భూకంపం ధాటికి మరణించిన వారి సంఖ్య బుధవారం 9,638కు చేరుకుంది. రెండు దేశాలలో గడ్డకట్టే వాతావరణం కారణంగా రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యం అవుతోందని అధికారులు తెలిపారు. టర్కీ అధ్యక్షుడు భూకంప ప్రభావిత ప్రాంతానికి చేరుకుని.. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
టర్కీ భూకంపం ఘటనలో మృతుల సంఖ్య ఏడు వేలకు పెరిగింది
టర్కీలో 5894 మంది చనిపోగా సిరియాలో 1832 మంది చనిపోయారు
రెండు దేశాల్లో మొత్తం 7726 మంది చనిపోయారు
భూకంపంతో అతలాకుతలమైన టర్కీ, సిరియా దేశాలు వెంటనే 'స్పేస్ అండ్ మేజర్ డిజాస్టర్స్ అంతర్జాతీయ చార్టర్'ను యాక్టివేట్ చేయమని కోరాయి.
భూకంపం కారణంగా సిరియాలో ఓ జైలు ధ్వంసమైంది. ఇదే అదనుగా కొందరు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు.. అధికారులపై తిరుగుబాటు చేసి పారిపోయారట.
వరుస భూకంపాల కారణంగా ఇప్పటివరకు రెండు దేశాల్లో 5 వేల మందికి పైగా మృతిచెందినట్లు అక్కడి మీడియా సంస్థలు తెలిపాయి.
సెంట్రల్ టర్కీలో మరోసారి భూమి కంపించింది. నిన్న అంటే జనవరి 6వ తేదీ సోమవారం మూడుసార్లు భారీగా కంపించిన భూమి..ఇవాళ మరోసారి కంపించింది. ఈసారి రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రత నమోదైంది. యూరోపియన్ మెడిట్టేరియన్ సిస్మోలాజికల్ సెంటర్ చెప్పినట్టుగా రాయిటర్స్ ప్రకటించింది.
టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం తరువాత మరో అతి పెద్ద సమస్య సవాలు విసరనుంది. భూ ప్రకంపనల వల్ల టర్కీ, సిరియాల్లో బిల్డింగులు బాగా బలహీనమైపోయాయి. చాలా భవనాలు కూలకపోయినా..పునాదులు బలహీనమయ్యాయి. కొన్ని ఇళ్ళకు భారీగా బీటలు వారాయి. ఎందుకంటే తొలిసారి భూకంపం సంభవించినప్పుడు కూలకుండా ఆగిన భవనాలు రెండవసారి భూమి కంపించినప్పుడు కూలిపోయాయి. అంటే ఇప్పుడు టర్కీ, సిరియా దేశాల్లో మిగిలున్న ఇళ్లకు ఏ క్షణంలో ప్రమాదం ముంచుకొస్తుందో అంచనా వేయడం కష్టమే.
NDRF రెస్క్యూ బృందాలు టర్కీకి
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF)కి చెందిన సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్‌లతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ C-17 టర్కీకి బయలుదేరింది
ఈ విమానం ఇతర భారతీయ సంస్థలతో పాటు IAF చే నిర్వహించబడే అనేక సహాయక చర్యలలో భాగం అవుతూ ఉంటుందిస్పెయిన్ ఆపన్నహస్తం
భూకంప బాధిత సిరియా ప్రజలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన స్పెయిన్
శిథిలాలలో చిక్కుకున్న వ్యక్తుల కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్‌లను పంపించారు
ఇజ్రాయెల్ సాయం
టర్కీకి ఆపన్నహస్తం అందించిన ఇజ్రాయెల్
టర్కీకి బయలుదేరిన ఇజ్రాయెల్ రెస్క్యూ టీమ్
అమెరికా సాయం
టర్కీ, సిరియాలో భూకంప విధ్వంసం
సంతాపం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు జో బిడెన్
బాధిత ప్రాంతాలకు సహాయం అందజేస్తానని హామీటర్కీకి అన్ని విధాలా సాయం చేస్తామని భారత్ హామీ
సాయం కోసం ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాన్ని, ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్‌ను టర్కీకి
శిథిలాల కింద చిక్కుకుపోయిన వందలాది మంది
గల్లంతయిన పలువురు
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
టర్కీలో ఏడు రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటన
టర్కీ, సిరియాలో వరుస భూకంప ఘటనలు యావత్ ప్రపంచాన్ని విషాదంలో నింపాయన్న సంగతి తెలిసిందే. రెండు దేశాలలోనూ మృతుల సంఖ్య క్షణక్షణం పెరుగుతుండగా.. వేల ఇళ్లు పేకమేడల్లా క్షణాల్లో కూలిపోతున్న విజువల్స్ కన్నీరు తెప్పిస్తున్నాయి. రెండు దేశాల్లో ఇప్పటివరకు 4000 మంది మృతదేహాలను గుర్తించగా.. 15 వేల మంది గాయపడి, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా వారిని ఆదుకునేందుకు భారత్ సహా ప్రపంచదేశాలు ముందుకొస్తున్నాయి.
Turkey Earthquake Death Toll: టర్కీలో భూకంపం ధాటికి మృతి చెందిన వారి సంఖ్య 1651 కి చేరగా, సిరియాలో మృతుల సంఖ్య 960 కి పెరిగింది. రెండు దేశాల్లో కలిపి భూకంపం ధాటికి మృతి చెందిన వారి సంఖ్య 2,611 కి పెరిగింది. శిథిలాలు తొలగించే కొద్దీ మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని రెండు దేశాల్లోని ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ తెలిపాయి.
వరుస ప్రకంపనలతో టర్కీ, సిరియాల్లోని పలు ప్రాంతాల్లోని భవంతులు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకుపోయిన వేల మందిని వెలికితీసే ప్రయత్నాలు కొనసాగుతున్న సమయంలో మరిన్ని తీవ్ర భూకంపం సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.
టర్కీ, సిరియాను భారీ భూకంపం అతలాకుతలం చేసింది. భూకంపం ధాటికి రెండు దేశాల్లో కలిపి మొత్తం మృతుల సంఖ్య 2,308కి చేరింది. టర్కీలో 1,498.. సిరియాలో 810 మంది మరణించారు.
టర్కీ సంభవించిన భారీ భూకంపంలో మరణాల సంఖ్య 10 వేలు దాటనున్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. ఇప్పటికే మృతుల సంఖ్య అక్కడ 600 దాటింది.
టర్కీలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. టర్కీలో భూకంపం రావడం ఇది మూడోసారి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.0గా నమోదైంది.
టర్కీ, సిరియాల్లోని పెను ప్రకంపనలను మూడు రోజుల ముందుగానే ఓ వ్యక్తి ఊహించారని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. భూప్రకంపనలను అధ్యయనం చేసే సోలార్ సిస్టమ్ జియోమెట్రీ సర్వే (ఎస్ఎస్‌జీఈఓఎస్)కు చెందిన పరిశోధకులు ఫ్రాంక్ హూగర్బీట్స్ ఈ ప్రకంపనలను ముందే అంచనా వేశారట.
అమెరికా జియోలాజికల్ సర్వే అంచనాల ప్రకారం.. టర్కీ, సిరియా దేశాల్లో మృతుల సంఖ్య 1,000 నుంచి 10,000 మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయి.
రెండోసారి భూకంపం ధాటికి టర్కీతో పాటు సిరియాలోని డమాస్కస్, లటాకియా ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
టర్కీలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.24 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 7.5గా నమోదైంది.
భారీ భూకంపం విలయంపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విపత్కర పరిస్థితుల్లో ఆయా దేశాలకు అండగా ఉంటామని తెలిపారు.
భారత్, నెదర్లాండ్స్, గ్రీస్, సెర్బియా, స్వీడన్, ఫ్రాన్స్ తదితర దేశాలు టర్కీ, సిరియాలకు సాయం అందిస్తామని హామీ ఇచ్చాయి. సహాయక సామగ్రి, ఔషధాలు వంటివి పంపిస్తామని చెప్పాయి.
టర్కీ, సిరియా దేశాల్లో భారీ భూకంపంపై యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రెండు దేశాలకు ఆపన్నహస్తం అందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి
తెల్లవారుజామున ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో భారీ భూకంపం రావడంతో.. మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు టర్కీ, సిరియాలలో 1600 మందికి పైగా మరణించారు. వేల మందికి పైగా గాయపడ్డారు.
టర్కీ యేలోని దియర్‌బకీర్.. సిరియాలోని అలెప్పో, హమా నగరాల్లో వందలాది భవనాలు కూలిపోయాయి. 7.8 తీవ్రతతో తొలి భూకంపం సంభవించిన తర్వాత గంటల వ్యవధిలో మరో 20 సార్లు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
భారీ భూకంపంతో టర్కీ, సిరియాలు అల్లాడిపోయాయి. సోమవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం పెను విలయం సృష్టించింది.