లండన్ విమానాశ్రయం మూసేశారు. విమానాలు లేకనో, లేక సాంకేతిక సమస్యో కారణం కాదు. విమానాశ్రయం సమీపంలో బాంబు దొరికింది. అందుకే ముందస్తు జాగ్రత్తగా విమానాశ్రయంను మూసేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విమానాశ్రయానికి సమీపంలో ఉన్న థేన్స్ నది వద్ద రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి బాంబు దొరికింది. ఎయిర్ పోర్ట్ లో రన్ వేకి సమీపంలో ఉన్న కింగ్ జార్జ్ వీ డక్ వద్ద పనులు చేస్తున్న కార్మికులు బాంబును గుర్తించి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని బాంబు నిర్వీర్యం చేసే పనిలో పడ్డారు. ముందస్తు జాగ్రత్తగా ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు తాత్కాలికంగా విమానాశ్రయంను మూసివేసినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు వెల్లడించారు. ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని.. మరింత సమాచారం కోసం ఆయా ఎయిర్ లైన్స్ ను సంప్రదించాలని అధికారులు కోరారు.


రెండో ప్రపంచ యుద్ధ సమయంలో (1940-1941) జర్మనీ యుద్ధ విమానాలు వేలాది బాంబులను లండన్ పై జారవిడిచాయి. ఈ బాంబులు అక్కడ జరుగుతున్న నిర్మాణ సమయంలో తరచూ బయటపడుతున్నాయి.