Republic Day 2024: దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుతున్నాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌ లో  జాతీయ పతాకాన్ని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆవిష్కరించారు. అదే విధంగా ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ తో  పాటు కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.  75వ రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా పాల్గోన్నారు. అదే విధంగా.. ఈవేడుకలలో భాగంగా రాష్ట్రపతి, దేశ ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో.. ముఖ్య అతిథిగా హజరైన ఫ్రాన్స్ ప్రెసిడెంట్ శుక్రవారం తన ప్రసంగంలో భారత్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. 2030 నాటికి దాదాపు ౩౦ వేల మంది భారతీయ విద్యార్థులు ఫ్రాన్స్ లో చదువుకునేలా టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపారు. ఫ్రెంచ్ భాషను, భారతీయ విద్యార్థులకు నేర్పించడం కోసం ప్రత్యేకంగా చర్యలు చేపడతామన్నారు.


Read Also: గణతంత్ర వేడుకలకు ముందు షాకింగ్ నిర్ణయం.. ఫిబ్రవరి 6 వరకు ఆ రాష్ట్రంలో 144 సెక్షన్.. కారణం ఇదే..


అన్నిరకాలుగా భారతీయ విద్యార్థులకు తోడ్పాటు అందించేలా నెట్ వర్క్ ను ఏర్పాటు చేస్తామని ఎమ్మాన్యుయల్ మాక్రాన్ పేర్కొన్నారు. దీనిలో పాటు.. ఫ్రాన్స్‌లో చదివిన మాజీ భారతీయ విద్యార్థులకు వీసా ప్రక్రియను మేము సులభతరం చేస్తామని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్  మాక్రాన్  వెల్లడించారు. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook