Mahatma Gandhi's great-grandson Satish Dhupelia dies: న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీ (Mahatma Gandhi) ముని మనవడు సతీష్ ధుపేలియా (Satish Dhupelia) కరోనాతో కన్నుమూశారు. దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్‌ (south africa johannesburg) లో కరోనాతో (COVID-19) పాటు ఇతర అనారోగ్య సమస్యలతో చికిత్స పొందతూ.. సతీష్ ధుపేలియా ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అయితే గతకొంతకాలంగా సతీష్ న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్నారు. దీనికి చికిత్స పొందుతున్న క్రమంలోనే ఆయన ఇటీవల కరోనా బారిన పడ్డారు. అయితే ఆదివారం రాత్రి గుండెపోటుతో సతీష్ ధుపేలియా కన్నుమూసినట్లు ఆయన సోదరి ఉమా ధుపేలియా మెస్త్రీ (Uma Dhupelia Mesthrie) తెలిపారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే గత మూడు రోజుల కిందటే సతీష్ దుపేలియా 66వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. Also read: మహాత్మాగాంధీ ఆర్థిక వ్యవహారాల్లో ఎలా ఉండేవారు ? చదవండి!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సతీష్ ధుపేలియా, ఉమా ధుపేలియా, కీర్తిమీనన్‌.. మనీలాల్‌ గాంధీ వారసులు. మనీలాల్.. మహాత్మాగాంధీ సోదరుడు. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలో అక్కడ నిర్వహించిన కార్యకలాపాలను వారు ముందుకు తీసుకెళ్తున్నారు. డర్బన్‌ సమీపంలోని ఫీనిక్స్‌ సెటిల్మెంట్‌ వద్ద మహాత్మా గాంధీ ప్రారంభించిన పనులను కొనసాగించేందుకు గాంధీ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌కు సహాయ సహకారాలు అందిస్తున్నారు. సతీష్ తన జీవితంలో ఎక్కువ భాగం మీడియాలో గడిపారు. ముఖ్యంగా వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్‌గా పనిచేయడంతోపాటు పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. సతీష్ ధుపేలియా మరణం పట్ల ఆయన స్నేహితులు, ప్రముఖులు నివాళులర్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.  Also read: Indian Army: సరిహద్దుల్లో రహస్య సొరంగం గుర్తింపు


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి