Oil Refinery Blast: ఆఫ్రికన్ దేశం నైజీరియాలో ఘరో ప్రమాదం. చమురు శుద్ధి కర్మాగారంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ప్రాణ నష్టం భారీగా జరగడమే కాకుండా గుర్తుపట్టలేనంతగా మృతదేహాలు పడి ఉన్నాయని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నైజీరియాలోని ఓ అక్రమ చమురు శుద్ధి కర్మాగారంలో జరిగిన భారీ పేలుడు విధ్వంసం సృష్టించింది. పేలుడు కారమంగా చెలరేగిన మంటల్లో దాదాపు వందమంది వరకూ సజీవ దహనమయ్యారని తెలుస్తోంది. నైజీరియాలోని రివర్స్, ఇమో స్టేట్ మధ్య ఈ ఘటన జరిగింది. ఇదొక అక్రమ చమురు శుద్ధి కర్మాగారం. భారీ పేలుడు , భయంకరమైన మంటల కారణంగా సిబ్బంది తప్పించుకోలేకపోయారని తెలుస్తోంది. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయి..చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇంకొంతమంది తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ చెట్టు కొమ్మలకు వేలాడుతూ కన్పించిన మృతదేహాలు.


నైజీరియాలో ఈ తరహా అక్రమ చమురు శుద్ధి కర్మాగారాలు చాలా ఉన్నాయి. పైప్‌లైన్స్ ధ్వంసం చేసి దొంగిలించే ముడి చమురును ఇలాంటివాటిలో శుద్ధి చేసి విక్రయిస్తుంటారు. ఆ సందర్బంగా తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. నైజీరియాలోనే కాకుండా ఆఫ్రికా దేశాల్లో ఈ తరహా ఇల్లీగల్ ఆయిల్ రిఫైనరీలు ఎక్కువే. నైజీరియాలోని నైజర్ డెల్టా భాగం దేశంలో అతిపెద్ద చమురు ఉత్పత్తి ప్రాంతం. ఇక్కడ్నించి రోజుకు 2 మిలియన్ బ్యారెల్స్ ఎగుమతి అవుతుంటుంది. అదే సమయంలో అక్రమ చమురు శుద్ధి కర్మాగారాలపై ప్రభుత్వం తరచూ దాడులు చేస్తుంటుంది. 


Also read: Sri Lanka economic crisis: శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం.. మరో 500 మి.డాలర్ల సాయం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.