Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం రాత్రి ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం బయటకు పరుగులు తీశారు. సునామీ హెచ్చరికలు లేకపోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Japan Earthquake: జపాన్ మెటరాలాజికల్ ఏజెన్సీ అందించిన సమాచారం ప్రకారం దక్షిణ జపాన్‌లోని నాన్యో ప్రాంతంలో భారీగా భూమి కంపించింది. జపాన్ లోని కైకూ, షికోకు ద్వీపాల్ని వేరు చేసే బుంగో ఛానెల్ భూకంపానికి కేంద్రంగా ఉందని గుర్తించారు. ఆస్థి, ప్రాణనష్టం వివరాలు ఇంకా అందాల్సి ఉంది.
జపాన్‌లోని యువాజిమాకు పశ్చిమ దిశలో 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. న్యూక్లియర్ ప్లాంట్‌పై భూకంపం ప్రభావం లేదని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రిక్టర్ స్కేలుపై 6 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో సంభవించే భూకంపాల్లో 5వ వంతు జపాన్‌లో చోటుచేసుకుంటుంటాయి. ప్రాణనష్టం దాదాపుగా లేదని తెలుస్తోంది. ఆస్థినష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇంతకుముందు మార్చ్ నెలలో కూడా జపాన్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6 తీవ్రత నమోదైంది.
Also read: Heavy Rains: 75 ఏళ్ల చరిత్రలో బారీ వర్షం, దుబాయ్‌లో ఎయిర్‌పోర్ట్ సహా అన్నీ జలమయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook