Heavy Rains: 75 ఏళ్ల చరిత్రలో బారీ వర్షం, దుబాయ్‌లో ఎయిర్‌పోర్ట్ సహా అన్నీ జలమయం

ఎడారి దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో సాధారణంగా వర్షాలు చాలా తక్కువ. ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి. అయితే నిన్న యూఏఈ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో దుబాయ్ సహా పలు ప్రదేశాలు అతలాకుతలమయ్యాయి. 

Heavy Rains: ఎడారి దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో సాధారణంగా వర్షాలు చాలా తక్కువ. ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి. అయితే నిన్న యూఏఈ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో దుబాయ్ సహా పలు ప్రదేశాలు అతలాకుతలమయ్యాయి. 

1 /5

ఎడారి దేశాల్లో సాధారణంగా వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. అదే సమయంలో ఎండలు మండిపోతుంటాయి. భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా వరద పరిస్థితులు తలెత్తాయి. ఒమన్ దేశంలో భారీ వర్షాల కారణంగా 18 మంది మరణించారు. 

2 /5

భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా వాహనాలను ఎత్తైన ప్రదేశాల్లో పార్కింగ్ చేసుకోవాలని సూచించింది.

3 /5

దుబాయ్ ఎయిర్‌పోర్ట్, దుబాయ్ మెట్రో, దుబాయ్ మాల్స్‌లో వర్షం నీరు చేరిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

4 /5

భారీ వర్షాల కారణంగా దుబాయ్ జలమయమైంది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వే పూర్తిగా నీట మునిగింది. చాలా విమానాలను దారి మళ్లించారు. విమానాశ్రయాన్ని కాస్సేపు మూసివేశారు. 

5 /5

దుబాయ్‌లో నిన్న కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇళ్లు, మాల్స్, మెట్రోల్లో నీరు చేరింది. వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది