Fire Accident: కోవిడ్ వార్డుల్లో ప్రమాదాలు ఆగడం లేదు. ఇరాక్‌లోని కోవిడ్ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు 52 మంది కరోనా రోగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇరాక్‌లో ఇది రెండవ ఘటన.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇరాక్‌లో మరోసారి కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident in Covid Ward)సంభవించింది. నస్రియా నగరంలోని అల్ హుస్సేన్ ఆసుపత్రిలో అర్దరాత్రి దాటిన తరువాత అగ్ని ప్రమాదం జరిగింది. ఆక్సిజన్ ట్యాంకర్లు పేలడంతో ఈ ఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు.అర్ధరాత్రి సమయం కావడంతో సిబ్బంది పెద్దగా లేరు. ఫలితంగా ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులంతా మంటల్లో చిక్కుకుని దగ్దమయ్యారు.ఈ ఘటనలో 52 మంది మరణించగా..22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరణించివారంతా కరోనా రోగులేనని..మంటలు, పొగ దట్టంగా ఉండటంతో ప్రమాద తీవ్రత ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వార్డు కెపాసిటీ 70 బెడ్స్‌గా తెలుస్తోంది. గత మూడు నెలల కాలంలో కోవిడ్ ఆసుపత్రి లేదా వార్డులో అగ్ని ప్రమాదం జరగడం ఇది రెండోసారి. ఏప్రిల్ నెలలో బాగ్దాద్‌లో(Bagdad fire accident) జరిగిన అగ్ని ప్రమాదంలో 82 మంది మరణించగా..110 మంది గాయపడ్డారు. వరుస ఘటనలపై ఇరాక్ ప్రభుత్వం(Iraq Government)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


Also read: Sputnik v Vaccine: మీరు స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తీసుకున్నారా..అయితే 3 రోజులు ఆ పనికి దూరంగా ఉండండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook