Terror Attack: రంజాన్ నెలలో కాల్పులకు తెగబడ్డ ఉగ్రమూకలు, 27 మంది మృతి
Terror Attack: పవిత్ర రంజాన్ మాసంలో ఇరాన్లో ఉగ్రదాడి జరిగింది. భారీ ఉగ్రదాడిలో ఏకంగా 27 మంది దుర్మరణం చెందారు. భద్రతా బలగాలపై విచక్షణా రహితంగా ఉగ్రమూకలు కాల్పులకు తెగబడ్డారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Terror Attack: ఇరాన్‌లోని చాబహార్, రస్క్ నగరాల్లో ఉగ్రవాదులు దాడి జరిపారు. ఆగ్నేయ సిస్తాన్-బలూచిస్తాన్‌లో ఉన్న ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 11 మంది భద్రతా సిబ్బందితో పాటు 16 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
ఉగ్రవాదులు దాడి చేసిన చాబహార్ నగరం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు 1400 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకేసారి రెండు మూడు ప్రాంతాల్లో ఉగ్రవాదాలు కాల్పులు జరిపారు. సున్నీ వర్గానికి చెందిన మిలిటెంట్లు ఈ దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. కాల్పులకు పాల్పడింది జైష్ అల్ అద్ల్ వర్గంగా భావిస్తున్నారు. షియా ఆధిపత్యం ఉన్న ఇరాన్‌లోని బలూచి జాతి మైనారిటీలకు మరిన్ని హక్కులు, మెరుగైన జీవన సౌకర్యాలు కల్పించాలంటూ జైష్ సంస్థ పోరాడుతోంది. ఇరాన్ భద్రతా దళాలపై గతంలో కూడా చాలాసార్లు దాడులు చేసింది.
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతం చాలాకాలంగా మాదక ద్రవ్యాల రవాణాకు కేంద్రంగా ఉంది. ఈ దాడిలో పాల్గొన్న దుండగుల్లో కొందరు ఆత్మాహుతి దుస్తులు ధరించి ఉన్నట్టు తెలుస్తోంది. ఒకేసారి మూడు ప్రాంతాల్లో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు చేశారు.
Also read: IPL 2024 PBKS vs GT: ఒక్కోసారి పొరపాట్లే ఊహించని విజయాన్ని అందిస్తాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook