Pablo Mari Injured: సూపర్ మార్కెట్‌లో కత్తితో దాడి.. ఫుట్‌బాల్ ప్లేయర్‌కు గాయాలు.. ఒకరు మృతి
Arsenal football player Pablo Mari Injured: ఇటలీలో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తితో కత్తితో సూపర్ మార్కెట్‌లో దాడికి పాల్పడ్డాడు. ఒకరు ప్రాణాలు కోల్పోగా.. నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఫుట్‌బాల్ ప్లేయర్ పాబ్లో మారి కూడా ఉన్నాడు.
Arsenal football player Pablo Mari Injured: ఇటలీలో గురువారం సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ ఓ సూపర్‌మార్కెట్‌లో ఓ వ్యక్తి ఐదుగురిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఫుట్‌బాల్ ప్లేయర్ పాబ్లో మారి కూడా ఉన్నాడు. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాడికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
మిలన్ శివారులోని అస్సాగోలోని సూపర్ మార్కెట్ (షాపింగ్ సెంటర్)లో ఈ సంఘటన జరిగింది. దాడి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ఆసుపత్రిలో చేరిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ కేసులో 46 ఏళ్ల ఇటాలియన్ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతను దాడికి చేయడానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. అయితే దాడి చేసిన వ్యక్తి మానసిక పరిస్థితి బాగోలేనట్లు గుర్తించారు. ఈ దాడిలో ఉగ్రవాదుల ప్రమేయం లేదని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో గాయపడిన ఆర్సెనల్ ఫుట్‌బాల్ ప్లేయర్ మారి ఆరోగ్యం బాగా ఉందని.. అతనికి ఎటువంటి తీవ్రమైన గాయాలు కాలేదన్నారు.
మారి త్వరగా కోలుకోవాలని మోంజా క్లబ్ సీఈఓ అడ్రియన్ గల్లియానో ఆకాక్షించారు. 'డియర్ పాబ్లో, మేమంతా మీకు, మీ కుటుంబానికి దగ్గరగా ఉన్నాము. మేము నిన్ను ప్రేమిస్తున్నాము. మీరు ఒక యోధుడు. త్వరలోనే కోలుకుంటారు' అంటూ ఆయన ట్వీట్ చేశారు.
సూపర్ మార్కెట్‌లో అకస్మాత్తుగా ప్రజలు పరిగెత్తడం చూశామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కత్తితో దాడి జరిగిన విషయం తెలుసుకున్న దుకాణదారులు తమ షాపులను క్లోజ్ చేశారు. ఈ దాడికి సంబంధించి సూపర్ మార్కెట్ నిర్వాహకులు మాట్లాడుతూ.. దాడి గురించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. వారు వెంటనే వచ్చి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి.. నిందితుడిని అరెస్ట్ చేశారని తెలిపారు.
Also Read: TRS MLAs Trap Case: టీఆర్ఎస్ మౌనం.. బీజేపీ దూకుడు.. సీఎం కేసీఆర్ మాస్టర్ ప్లాన్..!
Also Read: Telangana Raj Bhavan: రాజ్ భవన్‌పై బురదజల్లే కుట్ర..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook