TRS MLAs Trap Case: టీఆర్ఎస్‌ మౌనం.. బీజేపీ దూకుడు.. సీఎం కేసీఆర్ మాస్టర్ ప్లాన్..!

Cm KCR Silence: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ముగ్గురు వ్యక్తులు యత్నించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌తో పాటు పార్టీ ముఖ్య నేతలు మౌనంగా ఉంటుండగా.. బీజేపీ మాత్రం దూకుడుగా వ్యవహరిస్తోంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2022, 08:35 AM IST
TRS MLAs Trap Case: టీఆర్ఎస్‌ మౌనం.. బీజేపీ దూకుడు.. సీఎం కేసీఆర్ మాస్టర్ ప్లాన్..!

Cm KCR Silence: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఓ రేంజ్‌లో చర్చ నడుస్తోంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగ కాంతారావులను బీజేపీలోకి రావాలంటూ భారీ మొత్తంలో ముగ్గురు వ్యక్తులు ఆఫర్ చేయడం కలకలం రేపింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలో డీల్ కుదుర్చుకోవడానికి వచ్చిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు.

ఇక ఈ విషయంపై బీజేపీపై తీవ్రస్థాయిలో టీఆర్ఎస్ నేతలు విమర్శలకు దిగారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించడం నీచమైన చర్య అంటూ మండిపడ్డారు. అయితే బీజేపీ కూడా అదేస్థాయిలో అధికార పార్టీ నేతలకు కౌంటర్ ఇచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. దమ్ముంటే డీల్ కుదుర్చుకోవడానికి వచ్చినవారు బీజేపీ నేతలు అని నిరూపించాలని సవాల్ విసిరారు. మునుగోడులో ఓటమి భయంతో సీఎం కేసీఆర్ సరికొత్త డ్రామాకు తెరలేపారని అన్నారు. ఆ నలుగురు ఎమ్మెల్యే నెత్తిమీద రూపాయి పెడితే..  
అర్ధరూపాయికి కూడా ఎవరు కొనరంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

ఇక బీజేపీ కౌంటర్ ఎటాక్ తరువాత అందరూ సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ కోసం ఎదురుచూశారు. నలుగురు ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా చర్చించిన కేసీఆర్.. ఈ ఘటనలో ఆడియో టేపులను తెప్పించుకున్నారు. మంత్రులు కేసీఆర్, హరీష్‌ రావుతో మాట్లాడి ఆడియో, వీడియో ఆధారాలతో గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతారని ప్రచారం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎందరో ఈ ప్రెస్‌మీట్ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఈ విషయంపై సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా మౌనం వహించారు. అధికార పార్టీ ముఖ్య నేతలు కూడా ఈ విషయంపై ఎలాంటి కామెంట్స్‌ చేయలేదు. 

ఈ కేసు ప్రాథమిక విచారణలో ఉన్నందును మీడియా ముందు ఎలాంటి కామెంట్స్ చేయవద్దని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా పార్టీ నాయకులకు సూచించారు. అడ్డంగా దొరికినవారు మొరుగుతూనే ఉంటారని.. ఇలాంటి వాటిని పార్టీ పట్టించుకోవాల్సి అవసరం లేదన్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ వేదికగా బయటపెట్టాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా జాతీయ రాజకీయాలకు వెళ్లేందుకు మంచి మైలేజ్ వస్తుందని భావిస్తున్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనలో బీజేపీని జాతీయస్థాయిలో దోషిగా నిలబెట్టాలని టీఆర్ఎస్‌ భావిస్తుందని.. అందుకే ప్రస్తుతం వ్యూహాత్మకంగా సైలెంట్‌గా ఉంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

ఈ కేసులో అరెస్ట్ అయిన రామచంద్ర భారతి, నందకుమార్, సింహాచల రిమాండ్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారనడానికి సరైన ఆధారాలు లేవని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ పీసీ యాక్ట్ ఈకేసులో వర్తించదని అన్నారు. ముగ్గురు అనుమానితుల అరెస్ట్ విధానాన్ని తప్పుపట్టిన ఏసీబీ కోర్టు.. వారిని తక్షణమే విడుదల చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. 41crpc ప్రకారం నోటీస్ జారీ చేసి కేసు విచారణ జరపాలని సూచించారు.

Also Read: Ram Gopal Varma Vyuham: పవన్ మూడు పెళ్లిళ్లు అసలు మ్యాటరే కాదు.. వర్మ ప్లాన్ అదికాదట

Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు షాక్... మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News