man wakes to cockroach stuck in his throat in china: సాధారణంగా కిచెన్ లలో బొద్దింకలు ఎక్కువగా తిరుగుతుంటాయి. ఫుడ్ వెస్టేజ్ ఎక్కువగా పడేసే ప్రదేశాలలో బొద్దింకలు ఎక్కువగా సంచరిస్తుంటాయి. కొన్ని సార్లు మ్యాన్ హోల్స్ లలో సైతం.. బొద్దింకలు ఎక్కువగా కన్పిస్తుంటాయి.  డస్ట్ బిన్ ల దగ్గర, కిచెన్ లోని సింక్ ల కింద బొద్దింకలు ఎక్కువగా చూస్తుంటాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో.. చాలా మంది బొద్దింకలు అంటే భయంతో పారిపోతుంటారు. అసలు.. బొద్దింకల్ని చూస్తే.. అలర్జీగా చాలా మంది భావిస్తారు. ఈ నేపథ్యంలో.. ఒక బొద్దింక ఏకంగా రాత్రి పూట వ్యక్తి నోటిలోకి ప్రవేశించింది. కాసేపు అతను నిద్ర నుంచి లేచి అటు ఇటు చూశాడు. చైనాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.


పూర్తి వివరాలు..



చైనాలోని హైనాన్ ప్రావిన్స్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. హైకౌకు చెందిన హైనాన్ అనే వ్యక్తి రాత్రి పూట పడుకున్నాడు. అతని నోట్లోకి ఏదో దూరినట్లు అన్పించింది. అతను వెంటనే నిద్ర నుంచి మేల్కొన్నాడు. కానీ అతను కాసేపటికే మరల పడుకున్నాడు. బాగానే ఉన్నానని అనుకున్నాడు. కానీ అతని నోట్లోనుంచి మాత్రం భరించలేని దుర్వాసన రావడం స్టార్ట్ అయ్యింది. ఎంత నీట్ గా బ్రష్ చేసుకున్నా.. ఇదేం వాసన అంంటూ తెగ ఇబ్బంది పడిపోయాడు. చివరకు అతనికి శ్వాసతీసుకొవడంతో కూడ ఇబ్బంది ఏర్పడింది.


ఇలా మూడు రోజులు గడిచిపోయాయి. ఇక లాభంలేదని, ఈఎన్ టీ దగ్గరకు వెళ్లాడు. అక్కడ సదరువ్యక్తి  గొంతులో ఏదో ఉన్నట్లు వైద్యులకు అనుమానం కల్గింది. దీంతో వెంటనే స్కానింగ్ నిర్వహించారు. అప్పుడు.. ఆ స్కాన్ లో ఏదో రెక్కలతో ఒక జీవి ఉన్నట్లు బైటపడింది. దీంతో వైద్యులు..  బ్రాంకోస్కాపీ నిర్వహించి.. అతని శ్వాసనాళం కింది భాగంలో ఉన్న.. బొద్దింకను బైటకు తీశారు. దీని వల్లనే..అతను మూడు రోజుల పాటు నరకం అనుభవించినట్లు తెలుస్తోంది.


Read more: Ganesh Chaturthi 2024: వావ్.. గణపయ్య విగ్రహాల ముందు లేడీ పోలీస్ ల మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్.. 


బొద్దింకను చూసి వైద్యులుసైతం షాక్ కు గురైనట్లు తెలుస్తోంది. అది పొరపాటునశ్వాస నాళంకు అడ్డుగా చనిపోతే.. పరిస్థితి ఏంటని కూడా అక్కడి వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైతే.. బొద్దింకను తొలగించడంతో , బాధితుడు మాత్రం ఊపిరీపీల్చుకున్నాడు. రెండు రోజులు పాటు బాధితుడ్ని అబ్వర్జేషన్ లో ఉంచిన తర్వాత.. సదరు వ్యక్తిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఈ  ఘటన మాత్రం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.