Mumbai police mass steps infront of ganesh idol video: ఎక్కడ చూసిన గణపయ్య నవరాత్రి ఉత్సవాల సందడి నెలకొంది. ఊరువాడ, పల్లె, పట్నంతేడాలేకుండా గణపయ్యలను ప్రతిష్టిస్తున్నారు. వినాయక చవితి హంగామా దేశంలో మాములుగా ఉండదు. చాలా మంది యువత.. వినాయక చవితి వేడుకల్లో ఎంతో జోష్ గా పాల్గొంటారు. ఎక్కడ చూసిన వినాయక చవితి సందడి కన్పిస్తుంది.
𝗣𝗼𝗹𝗶𝗰𝗲 𝗽𝗲𝗿𝘀𝗼𝗻𝗻𝗲𝗹 𝗱𝗮𝗻𝗰𝗲 𝗶𝗻 𝗚𝗮𝗻𝗽𝗮𝘁𝗶 𝗽𝗿𝗼𝗰𝗲𝘀𝘀𝗶𝗼𝗻 | Men & women officials in uniform posted for security join the fun. pic.twitter.com/7SMr4mw7io
— MUMBAI NEWS (@Mumbaikhabar9) September 7, 2024
చిన్నా, పెద్ద తేడాలేకుండా ... పండగలో ఫుల్ జోష్ గా పాల్గొంటారు.ఈ క్రమంలో ముంబైలో పోలీసులు ఫుల్ జోష్ గా మాస్ స్టెప్పులు వేసిన ఒక వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు ఫుల్ జోష్ గా ఉన్నారంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.
పూర్తి వివరాలు..
సాధరణంగా పోలీసులు ఎమర్జెన్సీ సర్వీసుల విభాగంలోకి వస్తారు. వీరు ముఖ్యంగా పండుగలు, ఏదైన అనుకొని ఘటనలు వచ్చినప్పుడు.. వీరికి అస్సలు సెలవులు ఉండవు. కొన్నిసార్లు.. సెలవులు లేకుండా కూడా పనిచేయాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. ఈ నేపథ్యంల ఈరోజు దేశ వ్యాప్తంగా గణపయ్య చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఊరువాడ, పల్లె, పట్నం తేడాలేకుండా.. ఎక్కడ చూసిన కూడా ప్రజలంతా వినాయక చవితి ఉత్సవాలను ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటున్నారు.
ముంబైలో గణపయ్య ఉత్సవాలను ఎంతో వేడుకగా జరుపుకుంటారని చెబుతుంటారు. అక్కడ లాల్ బగ్చా రాజా.. వినాయకుడ్ని ఎంతో భక్తితో కొలుస్తారు. అయితే.. ఈరోజు గణపయ్యలను ఊరేగింపుగా మండపాలకు తీసుకొస్తుంటారు.ఈక్రమంలో డీజేలు, బ్యాండ్ ల మధ్యలో వినాయకులను ఊరేగింపుగా తీసుకొస్తుంటారు. ఎక్కడ కూడా అనుకొని ఘటనలను జరగకుండా .. పోలీసులు సెక్యురిటీ ఇస్తుంటారు.
అయితే.. మండపాల దగ్గర.. కొంత మంది పోలీసులు డీజే సౌండ్ లకు, దేవుడి మీద ఉన్న తమ భక్తిని కంట్రోల్ చేసుకొలేక పోయారు. గణేషుడిని తీసుకొస్తుండగా.. మండలపాల వాళ్లతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేశారు. లేడీపోలీసులు సైతం.. అక్కడ దుమ్మురేపే స్టెప్పులు వేశారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.