Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.0 గా నమోదు
Eathquake in Turkey | టర్కీని భారీ భూకంపం కుదిపేసింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0 గా నమోదు అయింది అని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ( USGS) తెలిపింది.
Strong Earthquake In Turkey | టర్కీని భారీ భూకంపం కుదిపేసింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0 గా నమోదు అయింది అని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ( USGS ) తెలిపింది. యూఎస్ జీఎస్ ప్రకారం సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందట. గ్రీస్ దేశంలోని నియోన్ కార్ల్ వోషన్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో భూమి భారీగా ( Earthquake) కంపించింది.
Also Read | TS EAMCET: ఇంటర్ వెయిటేజ్ మార్కులు ఈ ఏడాది లేనట్టే
టర్కీలోని ( Turkey ) విపత్తు నిర్వహణ, అత్యవసర సేవల విభాగం మాత్రం భూకంప తీవ్రతను 6.6గా తెలిపింది. అయితే అమెరికాలోని జియోలాజికల్ సర్వే మాత్రం 7.0గా చెబుతోంది. స్థానికంగా 11.50 నిమిషాల సమయంలో టర్కీలోని ఎగెన్ తీరం వెంబడి మార్మారా ప్రాంతం వరకు భూమి కంపించింది అని టర్కీ మీడియా సంస్థలు తెలిపాయి.
Also Read: AP Ration Cards: 35 రోజుల్లోనే 6 లక్షల రేషన్ కార్డులు జారీ చేసి ఏపి ప్రభుత్వం
గ్రీస్ దేశానికి సమీపంలో ఉన్న సమోస్ అనే దీవిలో సుమారు 45వేల మంది ప్రజలు నివసిస్తుంటారు. వీరందరినీ తీర ప్రాంతాల నుంచి దూరంగా ఉండమని అక్కడి ప్రభుత్వం కోరింది. ఈ భూకంప తీవ్రతా చాలా ఎక్కువగా ఉంది అని. ఇంత భారీ స్థాయిలో భూప్రకంపణలు రావడం సాధారణ విషయం కాదు అని ఇస్తాంబుల్ గవర్నర్ అలీ యెర్లికయా తెలిపారు.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR