అగ్రరాజ్యం అమెరికా మాజీ ప్రథమ మహిళ .. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామా గ్రామీ అవార్డు గెలుచుకున్నారు.  ఆమె రాసిన ఆడియో ఆల్బమ్ 'బికమింగ్'కు ఈ అవార్డు దక్కింది. ఏడాది క్రితం విడుదలైన ఈ 'బికమింగ్' ఆడియో బుక్ ఎక్కువగా సేల్ అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'బికమింగ్' ఆడియో బుక్ తో తొలిసారిగా మిషెల్ ఒబామా గ్రామీ అవార్డు అందుకోబోతున్నారు. నిజానికి గతంలోనే.. అంటే 2013లోనే  గ్రామీ అవార్డుకు ఆమె నామినేట్ అయ్యారు. అప్పట్లో అమెరికన్ గ్రోన్ పేరుతో రాసిన పుస్తకానికి  ఆమె నామినేట్ అయ్యారు.  కానీ దురదృష్టవశాత్తూ ఆమెకు ఆ ఏడాది గ్రామీ అవార్డు దక్కలేదు.  ఆ పుస్తకం వైట్ హౌస్ లో కిచెన్ , గార్డెన్ తోపాటు అమెరికాలో గార్డెన్స్ గురించి చెబుతుంది.  ప్రస్తుతం 'బికమింగ్'  ఆడియో బుక్ కు గ్రామీ అవార్డు దక్కడంతో ఆమె కల నెరవేరినట్లయింది. దీనిపై ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. 


కళాకారులు మైఖెల్ డైమండ్, ఆడమ్ హోరోవిట్జ్ తో కలిసి మిషెల్ ఒబామా గ్రామీ అవార్డు అందుకోనున్నారు.  ఈసారి గ్రామీ అవార్డు తీసుకుంటే .. పొలిటికల్ కేటగిరీలో గ్రామీ అవార్డులు తీసుకున్న హిల్లరీ క్లింటన్, జిమ్మి కార్టర్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా , జాన్ ఎఫ్ కెనడీ, ఫ్రాంక్లిన్ డి రూజ్ వెల్ట్ సరసన చేరిపోతారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..   


Read Also: హీరోయిన్ నభా నటేష్ లేటెస్ట్ స్టిల్స్