వాషింగ్టన్‌: 64 ఏళ్ల బిల్ గేట్స్ వాషింగ్టన్‌కు చెందిన రెడ్‌మండ్ సంస్థలో ఇకపై తన ప్రమేయం ఉండదని అన్నారు. ఇటీవల ఉత్పత్తి, హెల్త్ సాఫ్ట్‌వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సహా సాంకేతిక రంగాలపై ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ సత్య నాదెల్లాకు సలహాదారుగా ఉన్న విషయం తెలిసిందే. మైక్రోసాఫ్ట్ ఎల్లప్పుడూ నా జీవిత కాలంలో ఒక ముఖ్యమైన అంశమని నూతన ప్రతిపాదనలు రూపొందించడానికి సంస్థకై ప్రతిష్టాత్మక లక్ష్యాలను సాధించడంలో సహాయపడటానికి సత్య నాదెళ్లతో పాటు సాంకేతిక నాయకత్వంతో నిమగ్నమై ఉంటానని  బిల్ గేట్స్ శుక్రవారం ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: అప్పుడే పుట్టిన బిడ్డకు కరోనా వైరస్..!!


మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మైక్రోసాఫ్ట్ నుంచి పూర్తిగా వైదొలిగి మైక్రోసాఫ్ట్ బోర్డుకు రాజీనామా చేశారు. అంతేకాకుండా వారెన్ బఫెట్ కంపెనీ బోర్డు నుంచి కూడా తప్పుకుంటున్నట్టు బిల్ గేట్స్ ఓ ప్రకటనలో తెలిపారు.  పూర్తిస్థాయిలో సామాజిక కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని బిల్ గేట్స్ నిర్ణయం తీసుకోగా, 2014 నుంచి మైక్రోసాఫ్ట్ రోజువారి వ్యవహారాలకు బిల్ గేట్స్ దూరంగా ఉంటున్నారు. 1975లో ఆయన మైక్రోసాఫ్ట్ ను స్థాపించిన ఆయన 2000 సంవత్సరం వరకు మైక్రోసాఫ్ట్ సీఈఓగా బిల్ పనిచేశారు. కాగా బిల్ గేట్స్ సేవలతో ఇంకెవ్వరిని పోల్చలేమని, ఆ స్థానాన్ని భర్తీ చేయలేమని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యానాదెళ్ల ప్రకటించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


Read Also: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం