62 ఏళ్లనాటి అత్యాచారం కేసులో తీర్పు, శిక్ష మాత్రం లేదు..ఎందుకంటే
ప్రపంచంలో ఎక్కడ చూసినా అత్యాచార ఘటనలు సర్వసాధారణంగా మారిపోయాయి. అత్యాచార ఘటన కేసుల కూడా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. అటువంటిదే ఓ ఘటనకు సంబంధించి 62 ఏళ్ల అనంతరం తీర్పు వెలువడింది.
ప్రపంచంలో ఎక్కడ చూసినా అత్యాచార ఘటనలు సర్వసాధారణంగా మారిపోయాయి. అత్యాచార ఘటన కేసుల కూడా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. అటువంటిదే ఓ ఘటనకు సంబంధించి 62 ఏళ్ల అనంతరం తీర్పు వెలువడింది.
ఇండియాలోనే కాదు అత్యాచార ఘటనలు ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోనూ జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా చిన్నారులపై అత్యాచార ఘటనలు సైతం ఎప్పటి నుంచో జరుగుతున్నవే. అత్యాచార బాధితులు సాధారణంగా ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపోవడంతో అదే అదనుగా ఆ ఘటనలు ఎక్కువవుతున్నాయి. మరోవైపు ఫిర్యాదు చేసినా సరే..సరైన సాక్ష్యాధారాల్లేకనో లేదా మరో కారణం చేతనో పెండింగ్‌లో ఉంటూ వస్తున్నాయి. కాలయాపన జరిగే కొద్దీ ఈ తరహా కేసుల్లో న్యాయం జరగడమనేది కష్టంగా మారుతుంటుంది. అయితే అమెరికాలో మాత్రం ఏకంగా 62 ఏళ్ల తరువాత అత్యాచార ఘటనకు సంబంధించి తీర్పు వెలువడింది. 62 ఏళ్ల అనంతరం ఓ వ్యక్తిని అత్యాచారకేసులో నేరస్థుడిగా నిర్ధారించింది కోర్టు. డీఎన్ఏ పరీక్ష ఆధారంగా దోషిగా తేల్చింది న్యాయస్థానం.
అసలేం జరిగింది
1959లో వెస్ట్ సెంట్రల్ పరిసర ప్రాంతానికి చెందిన 9 ఏళ్ల బాలిక క్యాంప్‌ఫైర్ మింట్స్ అమ్మేందుకు బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఎంత గాలించినా తిరిగి రాలేదు. రెండు వారాల తరువాత ఆ బాలిక మృతదేహం లభ్యమైంది. బాలికపై దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి పేరు జాన్‌రీగ్ హాఫ్. అమెరికా ఆర్మీలో సైనికుడిగా పని చేస్తుండేవాడు. బాలికపై అత్యాచారం జరిగిన స్పోకెన్ కౌంటీలోని ఫెయిర్ ఛైల్డ్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో విధులు నిర్వహించేవాడు. 9 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన జాన్ రీగ్..మరో దారుణానికి ఒడిగట్టడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఓ మహిళ చేతులు , కాళ్లు కట్టి పొడిచి చంపేశాడు. ఈ కేసులో జాన్ రీగ్‌కు శిక్ష పడింది. ఈ కేసు విచారణ సందర్భంగా పోలీసులు గమనించిన కొన్ని ఆసక్తికర విషయాలతో బాలిక హత్యాచారం బయటపడింది. ఆ సమయంలో జాన్ రీగ్ అదే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నట్టు తేలింది. అయితే అప్పట్లో సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో పోలీసులు జాన్ రీగ్ నేరస్థుడని నిరూపించలేకపోయారు. ఈ ఏడాది బాధితురాలి శరీరం నుంచి వీర్య నమూనాల్ని సేకరించి చూసినప్పుడు జాన్ రీగ్‌తో సరిపోలాయి. అంతే ఆ చిన్నారి హత్యాచార ఘటనలో జాన్ రీగ్ నేరస్థుడని తేల్చిన న్యాయస్థానం శిక్ష మాత్రం వేయలేదు. ఎందుకంటే..సదరు నేరస్థుడు 1971లో అంటే 30 ఏళ్ల క్రితమే మరణించాడు.
Also read: Data Breach Exposed: సైబర్ హ్యాక్‌కి గురైన 'గో డాడీ'.. 1.2మిలియన్ల కస్టమర్ల డేటా చోరీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook