Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కలవరం..అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్య నిపుణులు..!
Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ టెర్రర్ పుట్టిస్తోంది. రోజు రోజుకు కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఈక్రమంలో వైద్య నిపుణులు కీలక సూచనలు జారీ చేశారు.
Monkeypox: ప్రపంచ దేశాలను మంకీ పాక్స్ పట్టి పీడిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 13 వేలకు పైగా కేసులు వెలుగు చూశాయి. రానున్న రోజుల్లో వ్యాధి ఉధృతి అధికం కానుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈక్రమంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని కోరుతున్నారు. ఈమేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చర్చించాలని అంటున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి.
ప్రస్తుతం మంకీ పాక్స్ కేసుల సంఖ్య 14 వేలకు చేరువలో ఉంది. ఆగస్టు నాటికి లక్షకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. త్వరలో జరగబోయే డబ్ల్యూహెచ్‌వో సమావేశాల్లో హెల్త్ ఎమర్జెన్సీపై చర్చించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రపంచదేశాలను కరోనా వణికిస్తోంది. ఈసమయంలో మరో మహమ్మారి కోరలు చాస్తోంది. యూఎస్ సహా అనేక దేశాల్లో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి.
మరోవైపు భారత్‌లోనూ మంకీపాక్స్ కేసులు వెలుగు చూస్తున్నాయి. విదేశాల నుంచి కేరళకు వచ్చిన ఇద్దరికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిఘా ఉంచింది. ఎయిర్‌పోర్టులు, ఓడ రేవుల్లో ముమ్మరంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఏపీలోకి మంకీపాక్స్ ప్రవేశించినట్లు వార్తలు వచ్చాయి. దీనిని ప్రభుత్వం ఖండించింది.
Also read:Shiv Sena: శివసేనలో తీవ్రమవుతున్న ముసలం..తిరుగుబాటు జెండా ఎత్తిన ఎంపీలు..!
Also read:Minister Harish Rao: తెలంగాణ ప్రజలకు శుభవార్త..త్వరలో కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook