Aung san suu kyi: మయన్మార్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ కీలక నేత, నోబెల్ పురస్కార గ్రహీత ఆంగ్ సాన్‌ సూకీకి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు మయన్మార్ కోర్టు కీలక తీర్పును ఇచ్చింది. 6 లక్షల డాలర్ల నగదు, బంగారు కడ్డీలను లంచం తీసుకున్నట్లు ఆమెపై ఆరోపణలున్నాయి. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు..సూకీ అవినీతికి పాల్పడినట్లు నిర్ధారించింది. దీంతో ఆ దేశంలో సంచలన ఘటన చోటుచేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం మయన్మార్‌లో సైనిక ప్రభుత్వం కొనసాగుతోంది. ఈక్రమంలోనే సూకీపై 11 అవినీతి కేసులను సైనిక ప్రభుత్వం నమోదు చేసింది. దీనిపై గతకొంతకాలంగా కోర్టులో విచారణ జరుగుతోంది. ఇవాళ తుది తీర్పు వచ్చింది. ఆంగ్ సాన్‌ సూకీపై సైనిక ప్రభుత్వం మోపిన మొదటి కేసులో జైలు శిక్ష పడింది. మిగిలిన 10 కేసులపై విచారణ జరుగుతోంది. సూకీపై ఉన్న ఆరోపణలన్నీ నిరూపణ అయితే ఆమెపై మరింత శిక్ష పడే అవకాశం ఉంది. 


మరోవైపు నేషనల్‌ లీగ్ ఫర్ డెమొక్రసీ పార్టీకి ఛైర్‌పర్సన్‌గా ఆంగ్‌సాన్ సూకీ ఉన్నారు. 1989 నుంచి 2010 వరకు అంటే 15 ఏళ్ల పాటు ఆమె హౌస్‌ అరెస్ట్‌లో ఉన్నారు. మయన్మార్‌లో సైనిక పాలన కోసం సూకీ అలుపెరగని పోరాటం చేశారు. స్వేఛ్చ, ప్రజాస్వామ్యం కోసం ఆది నుంచి పోరాటం చేస్తున్నారు. ఈక్రమంలోనే ఆంగ్‌సాన్ సూకీకి 1991లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది.
 


 


Also read:Weight Loss Yoga: ఈ యోగాసనంతో అధిక బరువు, జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చు!


Also read:10th Paper Leak: ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్ కలకలం..!


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook