NATO Summit: చైనాకు వ్యతిరేకంగా ప్రపంచదేశాలు గళమెత్తుతున్నాయి. చైనాను లక్ష్యంగా చేసేందుకు మొన్న జీ-7 దేశాల సమావేశం..ఇప్పుడు నాటో దేశాల సమావేశం తీర్మానిస్తున్నాయి. ఆ దేశంతో ఉన్న ముప్పు గురించి హెచ్చరిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సంక్షోభం(Corona Crisis)నుంచి చైనా దేశంపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఎక్కువవుతోంది. వాణిజ్యపరంగా చైనాతో విబేధిస్తూ వచ్చిన దేశాలు..కరోనా సంక్షోభానికి చైనానే కారణమంటూ ఆరోపించసాగాయి. ఇటీవలికాలంలో చైనాకు వ్యతిరేకంగా అంతర్జాతీయంగా పలు దేశాలు గళమెత్తుతున్నాయి. మొన్న జీ-7 దేశాల కూటమిలో చైనా మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తోందని మెజార్టీ దేశాలు తీర్మానించాయి. ఇప్పుడు నాటో దేశాల సమాఖ్య సైతం చైనాకు వ్యతిరేకంగా విమర్శలు చేసింది.


డ్రాగన్ దేశం చైనా (China) అంతర్జాతీయ నిబంధనల్ని ఉల్లంఘిస్తోందని నార్త్ అట్లాంటిక్ దేశాలు అంటే నాటో (NATO) దేశాల అధినేతలు విమర్శించారు. వ్యాపార, వాణిజ్య, సైనిక శక్తి, మానవ హక్కుల విషయంలో చైనా వైఖరిని ఖండించారు. బెల్జియం రాజధాని బ్రెస్సెల్స్‌లో తాజాగా జరిగిన నాటో సమావేశంలో 30 దేశాల అదినేతలు పాల్గొన్నారు. ప్రపంచ భద్రతకు చైనా ఓ సవాలుగా మారిందని ప్రకటన చేశారు. చైనాను ప్రత్యర్ధి దేశంగా పరిగణించేందుకు నాటో దేశాల అధినేతలు అంగీకరించకపోయినా..ఆ దేశ విధానాన్ని మాత్రం తప్పుబట్టారు. నాటాలో యూరప్, ఉత్తర అమెరికా దేశాలకు సభ్యత్వముంది. అమెరికా అధ్యక్షుడి హోదాలో జో బిడెన్ పాల్గొన్న తొలి సమావేశమిది. జీ 7 (G 7 Summit) శిఖరాగ్ర సదస్సులో చైనాకు వ్యతిరేకంగా గళమెత్తిన జో బిడెన్(Joe Biden)..నాటోలోనూ అదే స్వరం విన్పించారు. నాటో ప్రకటనను చేనా ఖండించింది. 


Also read: Nuclear War Heads: అణ్వస్త్ర సంపద ఇండియా కంటే ఆ రెండు దేశాల్లోనే ఎక్కువ, సిప్రి 2021 నివేదిక


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook