Nepal Earthquake 2023: నేపాల్‌లో భూమి భారీగా కంపించింది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదైన ఈ భూకంపం కేంద్రం కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఉండటంతో తీవ్రత చాలా ఎక్కువగా ఉందని తెలుస్తోంది. శిధిలాలు తొలగించేకొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేపాల్‌లో నిన్న అర్ధరాత్రి దాటిన తరువాత ఒక్కసారిగా భారీ భూకంపం సంభవించింది. నేపాల్‌కు వాయవ్యంగా జుమ్లా ప్రాంతానికి 42 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించిందని గుర్తించారు. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్ర నమోదైంది. నేపాల్ భూకంపం ప్రభావంతో ఢిల్లీ ఎన్సీఆర్, యూపీ, బీహార్, ఉత్తరాఖండ్, హర్యానా ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూకంపం కారణంగా నేపాల్‌లో పెద్దఎత్తున భవనాలు నేలకూలాయి. ఇప్పటి వరకూ 70 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. శిధిలాల కింద ఇంకా చాలామంది ఉండి ఉండవచ్చని అంచనా.


అర్ఱరాత్రి సమయం కావడంతో చాలా మంది ఆ సమయంలో నిద్రలో ఉన్నారు. అందుకే ప్రాణనష్టం ఎక్కువ ఉండవచ్చని తెలుస్తోంది. అప్పటికే చాలామంది రోడ్లపైకి చేరుకున్నారు. నేపాల్‌లోని జాజర్ కోట్ జిల్లాలోనే 30 మంది వరకూ మరణించి ఉండవచ్చని అంచనా. రుకుం జిల్లాలో 30 మంది మరణించి ఉండవచ్చని అంచనా. గాయపడినవారిని  సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. 


భూకంపంపై నేపాల్ ప్రధాని పుష్ప కమల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. 


Also read: Israel Hamas Conflict Updates: సొరంగంలో దాక్కున్న హమాస్ కీలక కమాండర్.. ఇజ్రాయెల్ దాడుల్లో హతం..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook