Hamas Commander Ibrahim Biari Death: గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ యుద్ధ విమానాల దాడులతో పరిస్థితులు భీకరంగా మారుతున్నాయి. హమాస్ ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) దాడులు చేస్తుండగా.. నిత్యం వందలాది మంది మరణిస్తున్నారు. తాజాగా చేసిన బాంబు దాడిలో దాదాపు 50 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒకరు హమాస్ కమాండర్, అనేకమంది గాయపడ్డారు. ఎన్‌క్లేవ్ మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆసుపత్రులలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జబాలియాపై జరిగిన దాడిలో అక్టోబర్ 7 దాడికి కీలక ప్రణాళికదారు, కార్యనిర్వాహకుడు ఇబ్రహీం బియారీని హత్య చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. గాజా స్ట్రిప్ ఈశాన్యం నుంచి ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో అతను కీలకంగా వ్యవహరించాడని ఐడీఎఫ్ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ జోనాథన్ కాన్రికస్ తెలిపారు.
ఇతర హమాస్ ఉగ్రవాదులు బియారీ మాదిరిగానే భూగర్భ సొరంగంలో దాక్కున్నారని.. అది కూలిపోవడంతో అతను మరణించారని ఆయన తెలిపారు. దీని వల్ల సామాన్యులు కూడా ప్రాణనష్టం కూడా జరిగిందని.. దీనిపై తాము దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అయితే ఈ విషయాన్ని హమాస్ ప్రతినిధి హజెమ్ ఖాస్సెమ్ ఖండించారు. సామాన్యులను చంపడానికి ఇజ్రాయెల్ ఇది ఒక సాకుగా ఉపయోగించుకుందని ఆరోపించారు. 1948 నుంచి ఇజ్రాయెల్ యుద్ధాలతో శరణార్థులకు నిలయంగా ఉన్న జబాలియాలో 400 మంది మరణించగా.. అనేక మంది గాయపడినట్లు హమాస్ తెలిపింది.
ఇజ్రాయెల్ భారీ పేలుళ్ల కారణంగా గాజాలో పెద్ద పెద్ద భవనాలు ధ్వంసమయ్యాయి. గాజా నివాసితులను ఉత్తరం నుంచి విడిచిపెట్టమని ఇప్పటికే ఐడీఎఫ్ హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ చాలా మంది అక్కడే ఉన్నారు. గాజా అతిపెద్ద టెలికమ్యూనికేషన్ ప్రొవైడర్ పాల్టెల్ ఎన్‌క్లేవ్‌లో అన్ని కమ్యూనికేషన్‌లు, ఇంటర్నెట్ సేవలను మళ్లీ నిలిపివేశారు. గాజాలోని అల్ షిఫా మెడికల్ కాంప్లెక్స్, ఇండోనేషియా హాస్పిటల్‌లోని పవర్ జనరేటర్లలో త్వరలో ఇంధనం అయిపోతుందని గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అష్రఫ్ అల్-కిద్రా తెలిపారు. ఆసుపత్రులకు తక్షణమే ఇంధనం సరఫరా చేయాలని పెట్రోల్ బంకుల యజమానులను ఆయన కోరారు.
గాజాలోని శస్త్రవైద్యులు తక్కువ వనరులతోనే బెదిరింపుల నడుమ ప్రజల ప్రాణాలను కాపాడే౦దుకు కృషి చేస్తున్నారు. పేషంట్లు ఎప్పుడు వస్తారో తెలియదని.. కొన్నిసార్లు తాము కారిడార్‌లలోనే రోగులకు చికిత్స అందించాల్సి ఉంటుందని డాక్టర్ మహమ్మద్ అల్-రన్ చెప్పారు. కాగా.. ఇప్పటివరకు మొత్తం రెండు వైపులా 10 వేల మందికిపైగా మృతి చెందారు. వీరిలో గాజాలోనే 8 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read: Chandrababu Case Updates: చంద్రబాబుకు ఊరట, మద్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి