Pokhara Plane Crash: నేపాల్‌లో ఆదివారం భారీ విమాన ప్రమాదం జరిగింది. నేపాల్‌లోని పోఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏటీ ఎయిర్‌లైన్స్ ఏటీఆర్-72 విమానం కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాదంలో 72 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. విమానం ల్యాండ్ అయ్యే ముందు కొండను ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం విమానాశ్రయం మూసివేశారు. విమానంలో ఐదుగురు భారతీయ ప్రయాణికులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

72 సీట్లున్న విమానం ల్యాండింగ్‌కు ముందే గాలిలో మంటలు చెలరేగాయి. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ సిబ్బంది నీటితో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.  ఇప్పటివరకు 68 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి పోఖారాకు ఏటీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. పోఖారా అంతర్జాతీయ విమానాశ్రయం, పాత విమానాశ్రయం మధ్య ఈ ప్రమాదం జరిగింది. విమాన ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని యతి ఎయిర్‌లైన్స్ ప్రతినిధి సుదర్శన్ ధృవీకరించారు.


విమానం కూలిపోయినప్పటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయని యతి ఎయిర్‌లైన్స్ ప్రతినిధి సుదర్శన్ తెలిపారు. ఎంతమంది చనిపోయారో ఇప్పుడే చెప్పడం కష్టమన్నారు. ఈ ఘటనకు సంబంధించి భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజలు కూడా స్వచ్ఛందగా ముందుకు వచ్చి మంటలను ఆర్పుతున్నారు.



 పోఖారా ఘటనపై నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ విచారం వ్యక్తం చేశారు. ఖాట్మండు నుంచి పోఖారాకు ప్రయాణికులతో వెళ్తున్న యతి ఎయిర్‌లైన్స్ ఏఎన్‌సీ ఏటీఆర్ 72 ప్రమాదానికి గురైనందుకు తాను చాలా బాధపడ్డానని ఆయన ట్వీట్ చేశారు. భద్రతా సిబ్బందికి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై ఆయన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. 


 



Also Read: SBI Loan Rates: ఎస్‌బీఐ ఖాతాదారులకు షాక్.. మళ్లీ పెరిగిన వడ్డీ రేట్లు  


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త.. జీతాల పెంపు ఎప్పుడంటే..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి