Nepal Plane Crash Video: నేపాల్‌లో విమానం కుప్పకూలే ముందు లైవ్ వీడియో.. భయంకరమైన దృశ్యాలు
Nepal Plane Crash Updates: నేపాల్ విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. విమానంలో ప్రయాణిస్తున్న ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వ్యక్తులు ఫేస్‌బుక్ లైవ్ వీడియో తీస్తుండగా.. ఒక్కసారి విమానం కుప్పకూలింది. ఇందులో ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు రికార్డు అయ్యాయి.
Nepal Plane Crash Updates: నేపాల్‌లో ఆదివారం జరిగిన భారీ విమాన ప్రమాదంలో 72 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 68 మంది మృతదేహాలను వెలికితీశారు. పోఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏటీ ఎయిర్‌లైన్స్ ఏటీఆర్-72 విమానం కుప్ప కూలిపోయిన విషయం తెలిసిందే. విమానం ల్యాండ్ అయ్యే ముందు కొండను ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. విమానం కూలిపోవడానికి కొన్ని నిమిషాల ముందు తీసిన కొన్ని వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
యతి ఎయిర్‌లైన్స్ ATR-72 విమానంలోని నలుగురు ప్రయాణికులు ఫేస్‌బుక్ లైవ్‌లో తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ నలుగురు ప్రయాణికులు ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌కు చెందిన వారు. ఫేస్‌బుక్‌లోని 1.3 నిమిషాల లైవ్ వీడియోలో పోఖరా పట్టణంపై ఫోకస్ చేస్తున్నప్పుడు.. వారిలో ఒకరు ఉత్సాహంగా ఇది సరదాగా ఉందంటూ వ్యాఖ్యానించాడు.
వారిలో ఒకరైన సోను జైస్వాల్ (29) కూడా ఫోన్ కెమెరాలో కనిపించాడు. ఈ ఫుటేజీలో విమానం కూలిపోవడానికి ముందు వేగంగా ఎడమవైపు మలుపు తిరుగుతూ మంటలు చెలరేగడం కనిపిస్తోంది. తరువాత ఫోన్ కెమెరా చుట్టు మంటలు చుట్టుముట్టాయి. ఎగసిపడుతున్న మంటల దృశ్యాలను మనం వీడియోలో చూడొచ్చు.
ఈ ప్రమాదంలో 68 మంది ప్రయాణికులతో పాటు మరణించిన ఐదుగురు భారతీయులలో యూపీ ఘాజీపూర్‌లోని బరేసర్‌కు చెందిన ఈ నలుగురు ప్రయాణికులు ఉన్నారు. సోను జైస్వాల్, అనిల్ రాజ్‌భార్, అభిషేక్ కుష్వాహా, విశాల్ శర్మగా గుర్తించారు. వీరు కాసిమాబాద్ తహసీల్‌లోని వివిధ గ్రామాలకు చెందిన వారు. వీరంతా ఈ నెల 13న పశుపతినాథ్ ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం ఖాట్మండులో దిగారు. అక్కడి నుంచి పారాగ్లైడింగ్ కోసం పోఖారాకు వెళుతున్నారు.
విమానం ల్యాండింగ్ చేయడానికి 10 సెకన్ల ముందు క్రాష్ అయింది. విమానం ల్యాండ్ కావాల్సిన విమానాశ్రయాన్ని జనవరి 1వ తేదీనే ప్రారంభించారు. గత 30 ఏళ్లలో నేపాల్‌లో జరిగిన ఘోర ప్రమాదాల్లో ఇది ఒకటి కావడం గమనార్హం. పోఖారా విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా నది లోయలో కూలిపోయి 68 మంది మరణించారు. విమానంలో ఐదుగురు భారతీయులు సహా 72 మంది ఉన్నారు. ఆదివారం రాత్రి కావడంతో సహాయక చర్యలు నిలిపివేశారు. మరో నలుగురు కోసం గాలిస్తున్నారు.
Also Read: Virat Kohli: సచిన్ రెండు రికార్డులను బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. చరిత్రలో తొలి ఆటగాడిగా..
Also Read: విరాట్ విధ్వంసం.. చరిత్ర సృష్టించిన టీమిండియా.. 73 పరుగులకే శ్రీలంక ఆలౌట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి