ఎదుటివారికి చెప్పేందుకే నీతులుంటాయి. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో మరీనూ. ఆ ఆడపిల్ల ఏ హోదాలో ఉన్నాసరే...ఫలానా డ్రెస్సింగ్ ఉంటాలంటూ సమాజమే నిర్ణయించేస్తుంటుంది. పాపం..ఫిన్లాండ్ ప్రధాన మంత్రి సనా మారిన్ ( Finland prime minister sanna marin ) కు ఇటువంటి ఇబ్బందే ఎదురైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఫిన్లాండ్ ప్రధానమంత్రి సనా మారిన్ కు ప్రపంచంలో ఓ ప్రత్యేకత ఉంది. అతి చిన్నవయస్సులోనే దేశ ప్రధాని కావడం. ఆడ, మగ అని వివక్ష చూపించే సమాజానికి ఇది అంతగా జీర్ణమయ్యే అంశం కాదు కదా. అందుకే అవకాశం లభించినప్పుడల్లా సనా మారిన్ పై సమాజంలోని కొందరు వ్యక్తులు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా లోనెక్ బ్లేజర్ ( Low neck blazer ) ధరించిన పాపానికి నెటిజన్లు ఆమెపై దాడి ప్రారంభించేశారు. ఎంతైనా ఆడబిడ్డ కదా..నీతులు , బుద్దులు నేర్పడానికి సిద్ధమైపోయింది సమాజం. దేశంలోని అత్యున్నత స్థానమైన ప్రధాని పీఠంలో ఉందని కూడా ఆలోచించలేదు. ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ పై విరుచుకుపడింది. ఇన్ స్టాగ్రామ్ ( Instagram ) లో ఆమె షేర్ చేసిన ఓ ఫోటోనే ఇందుకు కారణం. ప్రధాని పదవిలో ఉందని కూడా ఆలోచించకుండా నెటిజన్లు ఆమెపై అభ్యంతరక కామెంట్లు గుప్పించారు. ప్రధానివా లేదా మోడల్ వా అంటూ ట్రోల్ చేశారు.


34 ఏళ్ల  సనా మరిన్ ఈ నెల మొదట్లో  ఫ్యాషన్ మ్యాగజైన్ ట్రెండి ( Fashion magazine Trendi ) కి పోజులిచ్చారు. కవర్ ఫోటో షూట్ కోసం, ఆమె లోనెక్ కట్‌ ఉన్న బ్లాక్ బ్లేజర్‌ ధరించారు. అంతే ఇంకేముంది...ఈ ఫోటోపై పెద్ద దుమారమే రేగింది. ప్రధాని లాంటి ఉన్నత స్థానంలో ఉన్నవారు ఇలా చేయడం తగదు.. మీరు ప్రధానా లేక మోడలా.. మీ విశ్వసనీయత క్షీణించిందంటూ విమర్శలు ప్రారంభించారు.


అయితే విమర్శలు ఓ వైపు..మరోవైపు చాలా మంది మహిళలు ప్రధానికి మద్దతుగా నిలిచారు. ఈ తరహా వ్యాఖ్యలు మంచిది కాదన్నారు. చూడాల్సింది బట్టల్ని కాదని.. ఆమె సాధించిన విజయాలని సూచించారు. సనాకు మద్దతుగా వందలాది మహిళలు లో నెక్‌ బ్లేజర్‌ ధరించిన  ఫోటోలను ట్విట్టర్‌, సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. 


సోషల్ డెమోక్రాట్ అయిన సన్నా మారిన్ 2019 డిసెంబర్‌లో ఫిన్లాండ్ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. దేశ చరిత్రలో అతి పిన్నవయస్కురాలైన ప్రధానిగా నిలిచారు. Also read: Donald Trump: లాక్ డౌన్ విధించడం రాజ్యాంగానికి విరుద్ధం: డోనాల్డ్ ట్రంప్