భగ భగ మంటూ నిప్పు కణికలా ఎప్పుడూ మండుతూనే . .  ప్రపంచానికి వెలుగులు పంచుతున్న సూర్యుడిని చూడాలని చాలా మందికి  ఉంటుంది. కానీ  అతి ప్రకాశవంతమైన కాంతి కిరణాలు ప్రసరించే  ఆ  భాస్కరున్ని నేరుగా చూడడం చాలా కష్టం. అలా అని సూర్యున్ని చూసేందుకు ఇప్పటి వరకు ఎలాంటి పరికరాలు అందుబాటులో లేవు. ఒకవేళ నేరుగా కంటితో చూసినా చూపు దెబ్బతిని.. కళ్లు పోయే ప్రమాదం ఉంది. అలాంటిది సూర్యుని ఉపరితల భాగాన్ని నేరుగా ఫోటోలు తీశారు. ఇది మీకు నమ్మశక్యం కాకున్నా నిజం. 
 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హవాయ్ లోని ఖగోళ శాస్త్రవేత్తలు తొలిసారిగా ఈ ఘనత సాధించారు. డేనియల్ కె ఇనూయి సోలార్ టెలీస్కోప్ ద్వారా సూర్యుని ఉపరితల భాగాలను ఫోటోలు తీశారు. వాటిని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ విడుదల చేసింది. సూర్యుని కరోనా భాగంలో నుంచి ఈ ఫోటోలు తీసినట్లు నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ వెల్లడించారు. దీని ద్వారా మున్ముందు సూర్యునిలో తరచుగా సంభవించే సౌర తుఫానులను అంచనా వేసే అవకాశం  కలుగుతుందన్నారు. మరోవైపు సూర్యుని ఉపరితల భాగం ఫోటోలను చూస్తే . .  పాప్ కార్న్ ఉడుకుతున్న కుండలా కనిపిస్తోంది. అందులో ప్లాస్మా స్పష్టంగా కనిపిస్తోంది.



13 అడుగుల సోలార్ టెలిస్కోప్ 
సూర్యుని ఉపరితల భాగాన్ని ఫోటోలు తీయడానికి అత్యాధునిక టెక్నాలజీ కలిగిన  13 అడుగుల సోలార్ టెలిస్కోప్ ను ఉపయోగించారు. దీనికి ప్రముఖ శాస్త్రవేత్త డేనియల్ కె ఇనూయి పేరు పెట్టారు.  డిసెంబర్ 2013 నుంచి సూర్యున్ని ఫోటోలు తీసేందుకు నేషనల్ సైన్స్ పౌండేషన్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికి ఇది సాధ్యమైంది. ప్రపంచంలో సూర్యుని ఉపరితల భాగాన్ని ఫోటోలు తీయడం ఇదే తొలిసారి కావడం విశేషం .  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..