NZ MP cycles to hospital in labour: డెలివరీ (Delivery) అంటే మహిళలకు పునర్జన్మ లాంటిది. ఆ సమయంలో తెలియని ఆందోళన, ఒత్తిడి గర్భిణి స్త్రీలను (Pregnancy) వెంటాడుతుంటాయి. గర్భిణిలే కాదు డెలివరీ అయ్యే వరకూ కుటుంబ సభ్యుల్లోనూ ఆందోళన నెలకొంటుంది. ముఖ్యంగా మొదటిసారి డెలివరీ అయ్యే మహిళల్లో ఈ ఆందోళన కాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే వైద్యుల సలహాలు, సూచనలతో హెల్తీ లైఫ్ స్టైల్‌ను ఫాలో అయితే ఎలాంటి రిస్క్ లేకుండా సేఫ్ డెలివరీ జరగవచ్చు. తాజాగా న్యూజిలాండ్‌కి (Newzealand) చెందిన జూలీ అనే మహిళా ఎంపీ తన డెలివరీ కోసం స్వయంగా సైకిల్ తొక్కుతూ ఆసుపత్రికి వెళ్లారు. హెల్తీ లైఫ్ స్టైల్, వైద్యుల సపోర్ట్‌ వల్లే ఇది సాధ్యమైందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎంపీ జూలీ అన్నే జెంటర్ (MP Julie Anne Genter) తన డెలివరీ విషయాన్ని ఫేస్‌బుక్‌ పోస్టు ద్వారా వెల్లడించారు. 'బిగ్ న్యూస్... తెల్లవారుజామున 3.04 గం. సమయంలో మా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ వచ్చి చేరాడు. నిజానికి డెలివరీకి (Childbirth) సైకిల్‌పై వెళ్లాలని నేనేమీ ప్లాన్ చేసుకోలేదు. కానీ అనుకోకుండా అలా జరిగిపోయింది. 2గంటల సమయంలో మేము ఆసుపత్రికి బయలుదేరాం. ఆ సమయంలో నాకు పెద్దగా నొప్పులేమీ లేవు. 10 నిమిషాల తర్వాత ఆసుపత్రికి చేరుకోగా.. అప్పటికి నొప్పులు ఎక్కువయ్యాయి.' అని ఫేస్‌బుక్ పోస్టులో ఎంపీ చెప్పుకొచ్చారు.


ఆసుపత్రికి వెళ్లిన కాసేపటికే ఎంపీ జూలీకి డెలివరీ జరిగింది. ఆరోగ్యవంతమైన పండంటి బిడ్డకు (Childbirth) ఆమె జన్మనిచ్చారు. దీనిపై సంతోషం వ్యక్తం చేస్తూ..'ఇప్పుడు నా పక్కనే నా బిడ్డ నిద్రిస్తోంది. అచ్చు తన తండ్రి లాగే. నా పట్ల ఇక్కడి వైద్య బృందం చూపించిన శ్రద్దకు, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డెలివరీ చేసినందుకు సంతోషంగా ఫీలవుతున్నాను.' అని పేర్కొన్నారు. ఎంపీ జూలీ డెలివరీ కోసం ఇలా సైకిల్‌ తొక్కుతూ వెళ్లడం ఇదే మొదటిసారి కాదు. మూడేళ్ల క్రితం తన మొదటి కొడుకుకి జన్మనిచ్చినప్పుడు కూడా ఇలాగే సైకిల్ తొక్కుతూ ఆసుపత్రికి వెళ్లారు. ఎంపీ జూలీ (Newzealand) ఫేస్‌బుక్ పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. నెటిజన్ల నుంచి ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.



 


Also Read: Madhya Pradesh Taj Mahal Replica: భార్య కోసం మరో తాజ్ మహల్ కట్టిన అభినవ షాజహాన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook